Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు సవాల్.. చంద్రబాబుకు ప్రతిష్ట.. కంటిమీద కునుకులేకుండా చేసిన ఆ ఎమ్మెల్సీ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, అటు విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డిలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా కడప ఎమ్మెల్సీ ఎన

Webdunia
సోమవారం, 20 మార్చి 2017 (08:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, అటు విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డిలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా కడప ఎమ్మెల్సీ ఎన్నిక వీరిద్దరికి నిద్రలేమిరాత్రులను మిగిల్చిందట. దీనికి కారణం.. ఈ ఎన్నికల్లో వైకాపా తరపున జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి పోటీ చేయగా, టీడీపీ తరపున మారెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డి అలియాస్ బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక ఫలితం సోమవారం వెలువడనుంది. 
 
అయితే, ఈ మిగిలిన ఎమ్మెల్సీ స్థానాల కంటే ఈ ఎన్నిక ఫలితం చంద్రబాబుకు, జగన్‌కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యంగా తన బాబాయ్‌ను గెలిపించుకోవడం జగన్‌కు ఓ సవాల్‌గా మారింది. అలాగే బీటెక్ రవి విజయం సీఎం చంద్రబాబుకు ప్రతిష్టగా తయారైంది. వివేకానంద రెడ్డి గెలుపు.. జగన్‌కు రాజకీయం ఎంతో అవసరం. కడప జిల్లాలో వైసీపీ ఆధిక్యాన్ని నెలబెట్టుకోవాలంటే వివేకా గెలుపు వైసీపీకి తప్పనిసరిగా మారింది. 
 
అలాగే, పట్టుకోల్పోయిన కడపలో తిరిగి పుంజుకునేందుకు టీడీపీకి ఇదే సరైన అవకాశం. అందుకే ఇరు పార్టీల అధినేతలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. మరోవైపు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 839 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఎవరకెన్ని ఓట్లు పడ్డాయే సోమవారం తేలిపోనుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments