Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనం కేసుపై తీర్పు: "ఉంపుడుగత్తె"పై దుమారం

Webdunia
WD
సహజీవనం కేసు విషయంలో "ఓ పురుషుడు ఓ మహిళకు సంబంధించి ఆర్థిక భారాన్ని భరిస్తూ, ప్రధానంగా ఆమెను తన లైంగిక అవసరాలు తీర్చే 'ఉంపుడుగత్తె'గా ఉంచుకోవడమో, సేవకురాలిగా పనిచేయించుకోవడమో చేస్తే అది తమ మా దృష్టిలో వైవాహిక జీవితాన్ని పోలిన బంధం కాజాలదు" అంటూ సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలో ఉంపుడుగత్తె అనే పదప్రయోగంపై దుమారం రేగుతోంది.

ఉంపుడుగత్తె అనే పదం స్త్రీని కించపరచడమే అవుతుందని పలు మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇదిలావుంటే ముఖ్యంగా మన దేశంలో సహజీవనం అంతగా పెచ్చరిల్లిపోయి ఊడలమర్రిలా అల్లుకుపోయిందా అని చూస్తే... అవుననే అంటున్నాయి పలు సర్వేలు.

ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం తర్వాత ఈ సహజీవనం ఎక్కువైంది. నగరాలు, పట్టణాల్లో ప్రత్యేకించి ఉద్యోగాలు చేసే స్త్రీపురుషులు ఎవరికివారు వేరువేరు ఇళ్లలో మకాం వేసి జీవితాన్ని సాగించడం క్లిష్టంగా మారింది. ఈ తరుణంలో స్త్రీపురుషులిరువురు కలిసి ఒకే ఇంట్లో ఉంటే ఖర్చుతో పాటు స్త్రీకి భద్రత కూడా ఉండటంతో ఈ దారిలో పయనించడం మొదలైంది. అయితే ఇటువంటి సహజీవనం కొన్ని జంటల్లో లైంగిక సంబంధాలకు దారి తీస్తోంది. పెళ్లి కాకుండానే లైంగికంగా దగ్గరవడం, ఆ తర్వాత స్త్రీని పురుషుడు వదిలించుకోవాలనుకోవడం జరుగుతోంది.

తమిళనాడుకు చెందిన వేలుసామి అనే వ్యక్తి విషయంలోనూ ఇదే జరిగింది. వివాహితుడైన వేలుసామి పచి అమ్మాళ్ అనే మహిళతో కొంతకాలం సహజీవనం చేశాడు. తనతో సహజీవనం చేసినందుకు వేలుసామి తనకు రూ.500 భరణం చెల్లించాలంటూ పచిఅమ్మాళ్ అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే వేలుసామి తనకు అప్పటికే మరో స్త్రీతో వివాహమైందనీ, సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో కేసును విచారించిన సుప్రీం నాలుగు అంశాలు రుజువు చేసుకోవాలంటూ తీర్పునిచ్చింది.

వాటిలో మొదటిది.. సదరు జంట.. భార్యాభర్తల తరహాలో ఉంటున్నట్లు సమాజానికి చాటాలి, రెండోది... వివాహం చేసుకోవడానికి అవసరమైన చట్టబద్ధమైన వయస్సు వారికి ఉండాలి, మూడోది... అవివాహితులుగా ఉంటూ... చట్టబద్ధంగా వివాహం చేసుకోవడానికి అర్హులై ఉండాలి, ఇక నాలుగోది... సహజీవనం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉండాలి. కొంతకాలం భార్యాభర్తల్లా కలిసి జీవిస్తున్నట్లు సమాజంలో నమ్మకాన్ని కలిగించాలి.

అంతేతప్ప లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి ఓ పురుషుడు స్త్రీని దగ్గరకు తీసుకున్నంత మాత్రాన అది సహజీవనం కిందకు రాదని స్పష్టం చేసింది. ముక్కు మొహం తెలియని వారితో ఒక్కరోజు గడిపి దానికి భరణం చెల్లించాలంటే కుదరదని తేల్చి చెప్పింది.

సుప్రీంకోర్టు తీర్పుపై ఏ కొద్దిమందో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు తప్పించి సింహభాగం హర్షిస్తున్నారు. భారతీయ సంప్రదాయాలకు అద్దంపట్టే వివాహ వ్యవస్థను ఈ తీర్పు మరింత దృఢపరుస్తుందని అంటున్నారు. పాశ్చాత్య పోకడలను భారతీయ సంప్రదాయాలలో చొప్పించిన ఫలితమే ఈ సహజీవనమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు పాశ్చాత్య దేశాలు సహజీవనాన్ని క్రమంగా వదిలేసి వివాహ వ్యవస్థ వైపు పయనిస్తున్నాయి. కనుక సహజీవనం అనేది చివరికి వివాహబంధంతో ముడివడితే ఎటువంటి చిక్కులు తలెత్తబోవన్నది మేధావుల మాట.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు