Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగారక గ్రహం మీద అడుగుపెడితే....

Webdunia
ఆదివారం, 26 అక్టోబరు 2008 (03:32 IST)
అంగారక గ్రహంమీద మొట్టమొదటి సారిగా అడుగు పెట్టిన వ్యోమగాములు తమ తదుపరి జీవితమంతా అక్కడే గడపాల్సి ఉంటుందని చంద్రుడిపై అడుగు పెట్టిన రెండో మనిషిగా చరిత్రకెక్కిన ఎడ్విన్ ఆల్డ్రిన్ పేర్కొన్నారు, ఎందుకంటే అరుణ గ్రహం మానవ నివాసానికి అత్యంత అనుకూల ప్రాంతంగా ఉందని చెప్పారు.

అంగారక గ్రహం దాదాపు జీవావరణ పరిస్థితులకు అతి దగ్గారగా ఉంటుందని ఎడ్విన్ చెప్పారు. చంద్రుడి కంటే మరే ఇతర ప్రాంతం కంటే అంగారక గ్రహమే అత్యుత్తమమైనదని పేర్కొన్నారు. కారణం గడ్డ కట్టిన స్థితిలో ఉన్న నీటి నిల్వలు ఈ గ్రహంలో విస్తారంగా ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు.

అంగారక గ్రహంపై మనిషి జీవించడం చాలా సులభమని, చంద్రుని కంటే అరుణ గ్రహంపై ఉన్న మనుషులకు తగిన సహాయం అందించడం సులువుగా ఉంటుందని ఎడ్విన్ చెప్పారు.

అంగారక గ్రహానికి భూమికి మధ్య దూరం 55 మిలియన్ల నుంచి 400 మిలియన్ల కంటే ఎక్కువ దూరం ఉంటుందని తెలిపారు.
అత్యంత అనుకూల స్థితుల్లో సైతం అంగారక గ్రహానికి ఒకసారి పోయి తిరిగి రావాలంటే కనీసం 18 నెలలు పడుతుందని చెప్పారు.

అందుకే మనం ఆ గ్రహంమీదికి మనుషులను శాశ్వత ప్రాతిపదికను పంపించవలసి ఉంటుందని ఆల్డ్రిన్ చెప్పారు. అలా కాకుంటే మనం ఒకసారి అరుణ గ్రహం మీదికి వ్యోమగాములను పంపించి అందుకయిన ఖర్చు భరించి తర్వాత పూర్తిగా మానుకోవడమే తన ఉద్దేశంలో మంచిదని చెప్పారు.

నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు అంగారక గ్రహం మీదికి మానవ సహిత ఉపగ్రహాన్ని 2030 లేదా 2040 సంవత్సరంలో పంపడానికి సిద్ధమవలుతున్నాయి. ఈ గ్రహం మీదికి ఉపగ్రహం ద్వారా 6 మంది మాత్రమే వెళ్లగలని దపదఫాలుగా పంపించే ఉపగ్రహాల ద్వారా అరుణ గ్రహంపై 30 మందితో కాలనీని ఏర్పర్చవచ్చని ఎడ్విన్ తెలిపారు.

తాము అంగారక గ్రహం మీద నివాసం ఏర్పర్చుకునే ఉద్దేశంతో మాత్రమే అక్కడికి వెళుతున్నామని వ్యోమగాములకు ముందుగా అర్థం చేయించవలసి ఉంటుందని కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత తిరిగి భూమిని చేరుకోవచ్చని మాత్రం వారు ఆశించలేరని ఎడ్విన్ అన్నారు.

35 ఏళ్ల వయసులో మనిషి అక్కడికి పోతే 65 ఏళ్ల వయసు దాకా పనిచేసి వారు అక్కడే రిటైర్ కావచ్చని, లేదా వారిని ఆ వయసులో తిరిగి భూమికి రప్పించవచ్చని ఎడ్విన్ అన్నారు.

భూమి, అంగారక గ్రహం మధ్య ఉన్న కమ్యూనికేషన్ సమయంలో జాప్యం వల్ల అక్కడి కక్కడే నిర్ణయం తీసుకోగల వారిని మాత్రమే అరుణ గ్రహం మీదికి పంపవలసి ఉంటుందని ఎడ్విన్ అభిప్రాయపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Show comments