Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగారక గ్రహంపై మానవ గృహం..!!

Webdunia
File
FILE
భూగోళాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే మనిషి గతి ఏంటి..? ఎక్కడకు వెళ్లాలి..? మానవ జాతి భూమి మీద అంతం కావల్సిందేనా..? అలాంటి భయాలేమి అక్కర్లేందటున్నారు నాసా శాస్త్రవేత్తలు. ఈ మాట అంటోంది వేరే ఎవరో కాదు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు. కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టండి మిమ్మల్ని అంగారక గ్రహం మీదకు పంపిస్తాం అంటున్నారు.

భూమి మీద జనాభ సంఖ్య శరవేగంగా పెరిగిపోతుంది. పెరుగుతున్న జనాభ రద్దీతో మానవ జీనవం దుర్భరమయ్యే పరిస్థితులు ఉత్పన్నంకావచ్చు. జనాభా ఇలాగే పెరుగుతూ పోతే ఈ భూమి మీద కాలు కదపడం కూడా కష్టం కావచ్చు. ఒకవేళ.. శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నట్లుగా యుగాంతమే సంభవించి భూగ్రహం మనుగడకే ముప్పు వస్తుందని తెలిసినా భయపడాల్సిన పని లేదంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. అంగారక గ్రహంపై హ్యాపీ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంటు కట్టుకొని కాలు మీద కాలేసుకొని జీవించవచ్చని చెపుతున్నారు.

భూమి మీద నివసించడానికి కావలసిన అన్ని సౌకర్యాలు అంగారక గ్రహం మీద ఉన్నట్లు వీరి పరిశోధనలో వెల్లడైంది. నానాటికీ పెరిగిపోతున్న భూతాపం మానవ మనుగడకు ముప్పు కలిగింవచ్చు. అయితే, మనసుంటే మార్గమూ ఉంటుంది. మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. ఈ అనంత విశ్వంలో మానవుడికి ఏదో ఓ మూల చోటు దొరకకుండా పోదు. ఇదే శాస్త్రవేత్తలు ఇస్తున్న అభయ హస్తం. ఒకవేళ భూమి భద్రంగా ఉన్న అంగారక గ్రహం మీద గెస్ట్‌హౌస్ నిర్మించి అప్పుడప్పుడు హాయిగా రిలాక్స్ కావచ్చని చెబుతున్నారు.

నమ్మశక్యంగా లేదు కదూ..! కానీ.. నిజం ఒక్క 20 సంవత్సరాలు ఓపిక పడితే ఇది సాధ్యమని నిరూపిస్తామని అందుకు ముహుర్తం కూడా ఖరారు చేసేశారు నాసా శాస్త్రవేత్తలు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ప్రాజెక్టుకు శ్రీకారం కూడా చుట్టేశారు దీనికి 'వందేళ్ళ గ్రహాంతర వాసం' (100 ఇయర్స్ స్టార్‌షిప్) అనే పేరు పెట్టారు. నాసా ప్రధాన పరిశోధనా కేంద్రాలలో ఒకటైన అమెస్‌ పరిశోధనా కేంద్రానికి ఈ ప్రాజెక్టుపై పని ప్రారంభించడానికి 10 లక్షల డాలర్ల నిధులు సమకూరినట్లు ఆ కేంద్రం డైరెక్టర్‌ పీట్‌ వార్డెన్‌ చెప్పారు.

వాస్తవానికి ఇంతవరకూ అంగారక గ్రహం మీద మనిషి అడుగుపెట్టనేలేదు. ఇది భూమికి 3.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే రాకెట్‌లో గంటకు 70,000 కి.మీ. వేగంతో ప్రయాణిస్తే 8 నెలల సమయం పడుతుంది. ఒక స్పేస్ షిప్ అంగారక గ్రహానికి వెళ్లి రావాలంటే 2000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఎంతో వ్యయప్రయాసలతో కూడిన ప్రయాణం. అంగారక గ్రహంపై శ్వాశ్వతంగా ఉండేందుకు ఆసక్తి గల శాస్త్రవేత్తల కోసం నాసా వెతుకుతోంది.

ఇందుకోసం ఇప్పటికే నలుగురు శాస్త్రవేత్తలు ముందుకు వచ్చారు. అంగారక గ్రహానికి భూమికి చాలా సారూప్యతలు ఉన్నాయి. ఇక్కడిలాగే అంగారక గ్రహంపై కూడా ఒక మోస్తరు ఉపరితల ఆకర్షణ శక్తి వాతావరణంతో పాటు అత్యవసర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. నీరు కార్బన్‌ డై ఆక్సైడ్‌ అన్నీ ఉన్నాయి. రెండు అంతరిక్ష విమానాలలో ఒక్కొక్క విమానంలో ఇద్దరు చొప్పున మొత్తం నలుగురిని ముందుగా అంగారక గ్రహానికి పంపాలన్నది ప్రతిపాదన. మీకూ.. భూమిపై నివశించడం బోర్ కొట్టేసిందా.. అయితే రండి అంగారక గ్రహం (మార్స్) మీదకు వెళ్దాం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

Show comments