Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై అత్యాచారం చేసి... హత్య చేశారు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (14:57 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఓ మహిళను అత్యాచారం చేసిన కొందరు దుండగులు... ఆ తర్వాత హత్య చేశారు. ఈ ఘటన నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో వెలుగు చూసింది. నానక్‌రామ్‌గూడలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలిని గౌలిదొడ్డి ప్రాంతానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు.
 
ఈ నెల 25వ తేదీన పాత సామగ్రి సేకరిస్తూ వెళ్లిన మహిళ నిర్మాణంలో ఉన్న ప్రదేశానికి వెళ్లినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆమెపై దుండగులు లైంగిక దాడి చేసి అనంతరం బండరాయితో మోది అంతమొందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్‌ టీమ్‌ సాయంతో ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలోనే గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన అదృశ్యం కేసు ఆధారంగా విచారణ ప్రారంభించారు. తప్పిపోయిన మహిళే హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఘటనాస్థలిలో లభించిన ఆధారాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం