Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో విహహితపై సామూహిక అత్యాచారం

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (09:42 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ వివాహిత సామూహిక అత్యాచారానికి గురైంది. కొందరు కామాంధులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ దారుణం రాష్ట్రంలోని జహీరాబాద్‌లోని డిడిగి గ్రామ పరిధిలో జరిగింది. 
 
24 యేళ్ల వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో తీసుకొచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళను సికింద్రాబాద్‌లోని సమీప ప్రాంత వాసిగా గుర్తించారు. ఆటో ఎక్కిన వివాహితకు మత్తుమందు ఇచ్చారా? లేక మద్యం తాగించారా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. శుక్రవారం రాత్రి కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ నుంచి ఓ వివాహితను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత ఆమెను జహీరాబాద్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమ కామవాంఛ తీర్చుకున్న తర్వాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. 
 
శనివారం ఉదయం స్పృహకోల్పోయి అపస్మారక స్థితిలో పడివున్న మహిళను స్థానిక వ్యక్తి గుర్తించి జహీరాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో ఇది వెలుగులోకి వచ్చింది. వివాహితకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆమె తన పిల్లలతో కలిసి భర్తకు దూరంగా ఉంటుంది. 
 
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని సంగారెడ్డి సఖీ కేంద్రానికి తరిలంచారు. అయితే, ఈ గ్యాంగ్ రేప్‌ వ్యవహారంపై పోలీసులు కేసు కూడా నమోదు చేయకుండా గోప్యంగా ఉంచడంపై ఇపుడు పలు అనుమానాలకు తావిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం