Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం పూజ చేయమంటే అత్యాచారం చేసిన విశాఖ పూజారి, అందుకే హత్య

ఐవీఆర్
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (16:17 IST)
కొన్నిసార్లు విశ్వాసాలు ప్రాణాలను తీస్తున్నాయి. తమ ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలంటూ ఓ మహిళ ఓ పూజారిని సంప్రదించింది. ఐతే పూజలు సంగతి అటుంచి అతడు ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే సర్వనాశనం చేస్తానంటూ బెదిరించాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అప్పన్న అనే జ్యోతిష్యుడు తన భార్య, ఇద్దరు కుమారులతో పెందుర్తి బీసీ కాలనీలో నివాసం వంటున్నాడు. తనకు జ్యోతిష్యం తెలుసుననీ, ఎవరైనా ఇబ్బందుల్లో వుంటే అవి తీర్చుతానంటూ ఇంటింటికి వెళ్లి పూజలు చేస్తుంటాడు.
 
ఈ క్రమంలో భీమిలి మండలం నేర్లవలస గ్రామానికి చెందిన చిన్నారావు, మౌనిక దంపతులు లొడగలవానిపాలెంలో వుంటూ, ఆ ప్రాంతంలో టీ దుకాణం నడుపుతున్నారు. జ్యోతిష్యుడు అప్పన్న అప్పుడప్పుడు అక్కడ టీ తాగుతుండేవాడు. అలా మాటల సందర్భంలో తమకు కూడా ఆర్థిక సమస్యలున్నాయనీ, పూజ జరిపించాలని కోరారు. అందుకు అంగీకరించిన అప్పన్న ఈ నెల 7వ తేదీన వారి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో మౌనిక ఒంటరిగా వుంది. దీనితో అతడు కామంతో కళ్లు మూసుకుపోయి మౌనిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెపై అత్యాచారం చేసాడు.
 
జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానంటూ బెదిరించి వెళ్లిపోయాడు. ఐతే మౌనిక తనపై జరిగిన లైంగిక దాడి విషయాన్ని భర్త చిన్నారావుకి తెలియజేసింది. దీంతో చిన్నారావు ఎలాగైనా అప్పన్నను అంతమొందించాలని ప్రణాళిక రచించాడు. ఉప్పాడలో తన తల్లికి ఆరోగ్యం సరిగా లేదనీ, ద్విచక్రవాహనంపై ఇద్దరం వెళ్దామంటూ చెప్పాడు. అది నమ్మి వచ్చిన అప్పన్నను తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని వెళ్లి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అతడిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఈ దాడిలో చిన్నారావు కుడిచేయి చూపుడువేలికి గాయం కూడా అయ్యింది. 
 
10వ తేదీ అర్థరాత్రి అప్పన్నను చంపిన చిన్నారావు వేకువ జామునే తన భార్య మౌనికను తీసుకుని అప్పన్న మృత కళేబరం దగ్గరకు వెళ్లాడు. తనతో పాటు పెట్రోల్, టిన్నర్ తీసుకున్నాడు. ఉదయం 6 గంటల సమయానికల్లా అప్పన్న శవాన్ని పెట్రోలుతో తగులపెట్టేసారు. ఐతే అక్కడ కపాలంతో పాటు మరికొన్ని ఎముకలు వుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో చిన్నారావుకి సంబంధించిన వస్తువులు కొన్ని లభించడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దీంతో వాస్తవాన్ని మౌనిక, చిన్నారావు అంగీకరించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విరాట్‌ కర్ణ, నభా నటేష్‌, ఐశ్వర్యమీనన్‌ పై గణేష్‌ సాంగ్‌ షూటింగ్‌

నేచురల్ స్టార్ నాని HIT: ది 3rd కేస్ ఇంటెన్స్ టీజర్ సిద్ధం

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం