Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీలి చిత్రాలు చూపిస్తూ.. అలా శారీరకసుఖం ఇవ్వాలని భార్యపై ఒత్తిడి...

వరుణ్
మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (08:55 IST)
నిలి చిత్రాల్లో కనిపించే అమ్మాయిలు చేసే విధంగా శృంగారంలో పాల్గొనాంటూ భార్యపై ఒత్తిడి తెచ్చిన ఓ భర్తతో సహా మొత్తం ముగ్గురిపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన ఓ యువతికి గత 2021 ఏప్రిల్ నెలలో వివాహమైంది. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం ఆమెను భర్త వేధిస్తూ వస్తున్నాడు. నిజానికి వివాహ సమయంలో కట్నం కింద రూ.2 లక్షల నగదు, రూ.50 వేల విలువైన గృహోపకరణ వస్తువులు అందజేశారు. భర్త కృష్ణా జిల్లా కూచిపూడిలో కిరాణా హోల్‌సేల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. 
 
ఈ క్రమంలో గత మూడేళ్లుగా అదనపు కట్నం కోసం ఆమెను వేధించసాగాడు. దీనికి అత్త, మరిదిలు తోడయ్యారు. అదేసమయంలో ఆ వ్యక్తి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య.. భర్తను నిలదీసింది. దీంతో ఆమెకు మొబైల్ ఫోనులో నీలి చిత్రాలు చూపిస్తూ ఆ విధంగా చేయాలంటూ ఒత్తిడి చేయసాగాడు. ఈ వేధింపులు శృతిమించి పోవడంతో వాటిని తట్టుకోలేని ఆ యువతి.. పుట్టింటికి వెళ్లి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్తతో పాటు అత్తల, మరిదిలపై విజయవాడ దిశ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
శంషాబాద్ విమానాశ్రయాన్ని పేల్చివేస్తాం... బాంబు బెదిరింపు... 
 
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బాంబులతో పేల్చివేస్తామంటూ బెదిరించి ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని వైభవ్ తివారీగా గుర్తించారు. బెంగుళూరు నగరానికి చెందిన ఈ నిందితుడు... విమానంలో హైజాకర్లు ఉన్నారని, వారు బాంబులతో విమాశ్రయాన్ని పేల్చివేస్తారంటూ శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు ఈమెయిల్స్ పంపించాడు. రెండు పర్యాయాలు అతడు ఇలాగే ఈమెయిల్స్ చేరవేశాడు. ఈ బెదిరింపులతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విమానాశ్రయం మొత్తం విస్తృతంగా తనిఖీలు చేశారు. 
 
ఈ తనిఖీల్లో ఎక్కడా కూడా అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దాంతో ఆ బెదిరింపులు ఉత్తుత్తివేనని తేలింది. దీంతో కేసు నమోదు చేసిన ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి.. బెంగుళూరుకు చెందిన వైభవ్ తివారీయే ఈ నకిలీ బెదిరింపులకు పాల్పడినట్టు గుర్తించి అరెస్టు చేశారు. కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైన తివారీ ఈ తరహా నకిలీ బెదిరింపు ఈమెయిల్స్ పంపినట్టు పోలీసులు గుర్తించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ తో C-మంతం గ్లింప్స్‌

శివ కందుకూరి, రాజీవ్ కనకాల చాయ్ వాలా ఫస్ట్ లుక్

సత్యదేవ్, ఆనంది కాంబినేషన్ లో వచ్చిన అరేబియా కడలి రివ్యూ

అపరిచితులుగా కలిసిన ప్రేమికులుగా మారిన కాన్సెప్ట్ తో కపుల్ ఫ్రెండ్లీ

సూపర్ స్టార్ తెలుగు సినిమాకు గర్వకారణం అంటు దీవెనలు ఇచ్చిన మెగాస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments