30 ఏళ్ల వివాహితకు వీడియో కాల్, నేను చనిపోతున్నా లక్ష్మీ: 22 ఏళ్ల ప్రియుడు ఆత్మహత్య

ఐవీఆర్
బుధవారం, 29 జనవరి 2025 (12:32 IST)
మొబైల్ ఫోన్లు వచ్చాక సంబంధాలు మెరుగు సంగతి అటు వుంచితే వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు, పెళ్లి కాక మునుపే సహజీవనం వంటివి ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారాలు కొన్ని కన్నుగప్పి నడుస్తుండగా మరికొన్ని బైటపడగానే ప్రాణాలు తీసేస్తున్నాయి. ఇలాంటి విషాదకర ఘటన విశాఖపట్టణం జిల్లాలోని పద్మనాభ మండలం కృష్ణాపురం గ్రామంలో చోటుచేసుకున్నది. 22 ఏళ్ల యువకుడికి 30 ఏళ్ల లక్ష్మి అనే మహిళకు మధ్య వివాహేతర సంబంధం వారి ప్రాణాలను బలిగొన్నది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
కృష్ణాపురంలో నివాసం వుంటున్న లక్ష్మి భర్త లారీ డ్రైవర్. వీరికి ఇద్దరు సంతానం. భర్త లారీ డ్రైవర్ కావడంతో కొన్ని వారాలు పాటు ఇంటికి దూరంగా వుంటుండేవాడు. ఈ క్రమంలో చిన్నాచితక పనులు చేసి పెట్టేందుకు 22 ఏళ్ల ఆదిత్య ఆమె ఇంటికి వస్తూపోతుండేవాడు. వారి మధ్య మరింత సన్నిహిత సంబంధం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.
 
ఐతే వీరి మధ్య సంబంధం గురించి ఊరిలో మెల్లగా ప్రచారం మొదలవడంతో వివాహిత అతడిని దూరంగా వుండమని చెప్పినట్లు సమాచారం. దీనితో మనస్థాపానికి గురైన యువకుడు, నువ్వు నాతో లేనప్పుడు బ్రతికి వుండి లాభం లేదంటూ వివాహితకు వీడియో కాల్ చేస్తూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హఠత్పరిణామంతో భయపడిన వివాహిత కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఒకేరోజు ఒకే గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకోవడంతో ఆ ఊరంతా విషాదంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

తర్వాతి కథనం
Show comments