Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను మంచానికి కట్టేసి.. గొడ్డలితో నరికి.. ఐదు ముక్కలు చేసిన భార్య... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (11:58 IST)
అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్త పట్ల ఆ మహిళ కాళికాదేవిలా ప్రవర్తించింది. నిద్రిస్తున్న భర్తను మంచానికి కట్టేసి.. గొడ్డలితో నరికి చంపేసింది. ఆ తర్వాత శరీరాన్ని ఐదు ముక్కలు చేసింది. ఆ ముక్కలను కాలువలో పడేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిభిత్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఫిలిభిత్‌లోని గుజ్రాలా ప్రాంతంలోని శివనగర్‌కు చెందిన 55 యేళ్ల పాంపాల్ భార్య దులారో దేవీ కొన్ని రోజులుగా తన భర్త స్నేహితుడితో కలిసి ఉంటుంది. నెల రోజుల క్రితం ఆమె తిరిగి గ్రామానికి చేరుకుంది. ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ సమీపంలోనే భార్యాపిల్లలతో కలిసి ఉంటున్న కుమారుడికి చెప్పింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దులారో దేవి ప్రవర్తనను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించారు. 
 
ఈ విచారణలో ఆమె నిజం చెప్పింది. భర్తను తానే చంపేసినట్టు అంగీకరించింది. ఆదివారం రాత్రి భర్త నిద్రపోయిన తర్వాత మంచానికి కట్టేసి గొడ్డలితో నరికి చంపానని, ఆతర్వాత ఐదు ముక్కలుగా కోసి సమీపంలోని కాలువలో పడేసినట్టు తెలిపింది. దీంతో అతడి శరీర భాగాల కోసం పోలీసులు ఈతగాళ్ల సాయంతో కాలువలో గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments