Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భవతి భార్యకు హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చిన ల్యాబ్ టెక్

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (14:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. గర్భవతి అయిన భార్యకు కట్టుకున్న భర్త హెచ్ఐవీ ఇంజెక్షన్ వేశాడు. భర్త అక్రమ సంబంధాన్ని నిలదీయడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్‌లో ఓ ఆసుపత్రిలో ఓ వ్యక్తి ల్యాబ్ టెక్నీషీయన్‌గా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నాడు. అతని పేరు మహేశ్ గౌతమ్. ఈయనకు 2020లో ఓ మహిళలో వివాహమైంది. 
 
అయితే, అదే ఆసుపత్రిలో పనిచేసే మరో ఉద్యోగినితో మహేశ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలియడంతో భార్య అతడిని నిలదీసింది. ప్రియురాలిని వదులుకోవడానికి ఇష్టపడని మహేశ్... భార్యను వదిలించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 
 
ఇందుకోసం విడాకులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేసేవాడు. దానికి ఆమె నిరాకరిచింది. పైగా, అప్పటికే ఆమె గర్భందాల్చివుంది. కానీ, భర్త మాత్రం అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. గర్భిణి అని కూడా చూడకుండా ఆమెకు ఓ హెచ్ఐవీ సూదితో ఇంజెక్షన్ ఇచ్చాడు. 
 
ఓ హెచ్ఐవీ రోగికి చేసిన ఇంజెక్షన్ ను అలాగే తీసుకువచ్చి భార్యకు గుచ్చాడు. ఈ విషయం అతడి భార్య తెలిసింది. దాంతో ఆమె తన కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 
ఈ కుట్రలో మహేశ్, అతని తల్లిదండ్రులతో పాటు ఆసుపత్రి యజమాని కూడా భాగస్వామేనని ఆ అమ్మాయి తండ్రి ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి యజమాని వీరికి బంధువు కావడంతో సహకరించాడని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం