Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ శిక్షణ పొందుతున్న విద్యార్థినిపై ఇద్దరు టీచర్ల లైంగికదాడి...

ఠాగూర్
ఆదివారం, 10 నవంబరు 2024 (14:08 IST)
వైద్య కోర్సుల ప్రవేశ పరీక్ష నీట్ కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థినిపై ఇద్దరు టీచర్లు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో జరిగింది. ఈ ఘటనపై ఇద్దరు కామాంధ ఉపాధ్యాయులను అరెస్టు చేసిన పోలీసులు జైలుకు తరలించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నీట్ కోచింగ్ కోసం 2022లో బాధిత విద్యార్థిని కాన్పూరు వచ్చి ఓ ప్రముఖ కోచింగ్ సెంటరులో చేరింది. విద్యార్థులందరికీ పార్టీ ఇస్తున్నానని, నువ్వు కూడా రావాలంటూ ఈ యేడాది జనవరిలో బయాలజీ టీచర్ సాహిల్ సిద్దిఖీ (32) ఆమెను ఇంటికి ఆహ్వానించాడు. ఆమె వెళ్లాక అక్కడ ఎవరూ లేకపోవడాన్ని గుర్తించింది. సాహిల్ ఆమెతో మద్యం తాగించి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను వీడియో తీశాడు.
 
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతానని, తన కుటుంబాన్ని చంపేస్తానని సిద్దిఖీ తనను బెదిరించాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత నిందితుడు ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమెను తన ఫ్లాట్‌లో కొన్ని రోజులపాటు నిర్బంధించాడు. అక్కడ 39 ఏళ్ల కెమిస్ట్రీ టీచర్ వికాశ్ పోర్వాల్ కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాధితురాలు మైనర్ అని పోలీసులు తెలిపారు.
 
తాను హోలీ జరుపుకొనేందుకు ఇంటికి వెళ్లినప్పుడు సిద్దిఖీ ఫోన్ చేసి తనను వెంటనే వెనక్కి రావాలని ఆదేశించాడని, రాకుంటే తన కుటుంబానికి హాని చేస్తానని బెదిరించాడని బాధితురాలు పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

‘వికటకవి’ పీరియాడిక్ సిరీస్‌.. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఖాయం: డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ మ‌ద్దాలి

కార్తీ లుక్ దేనికి హింట్.. కంగువకు సీక్వెల్ వుంటుందా?

తాజా ఫ్యాషన్ ఫోటోషూట్‌లో శృతి హాసన్ అదుర్స్

గమ్మత్తయిన గాత్రం కోసం రమణ గోగులను రంగంలోకి దింపిన అనిల్ రావిపూడి

పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. శ్రీలీల ఫీజెంత.. రష్మిక మందన్న ఎంత తీసుకుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

తర్వాతి కథనం
Show comments