Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెకు అత్తింటి వేధింపులు... చూడలేక తండ్రి ఆత్మహత్య

ఠాగూర్
శుక్రవారం, 27 డిశెంబరు 2024 (17:27 IST)
అత్తారింటికి పంపించిన కుమార్తెకు వివిధ రకాలుగా వేధింపులు ఎక్కువయ్యాయి. వీటిని తెలుసుకుని తట్టుకోలేని ఓ తండ్రి కుమార్తె కోసం తన ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పు దూబగుంటలో జరిగింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
దూబగుంటకు చెందిన బొట్టా శ్రీనివా నులు (52) 30 ఏళ్ళ క్రితం స్వగ్రామాన్ని వదిలి ఉపాధి కోసం విశాఖ జిల్లా భీమిలికి వెళ్లాడు. అక్కడ ఇటుక బట్టీల వ్యాపారం చేసుకుంటూ భార్య, కుమారుడు, కుమార్తెతో జీవిస్తున్నాడు. ఆ ప్రాంతంలో భార్య తరపు బంధువైన సూర్యకుమారి రెండో కుమారుడు చంద్రశేఖర్‌కు తన కుమార్తె యమున (24)ను ఇచ్చి ఐదేళ్ల క్రితం ఘనంగా పెళ్లి చేశాడు. 
 
ఈ దంపతులకు ఓ కుమారుడు (3) ఉన్నాడు. ఈ నేపథ్యంలో అప్పటివరకు బీడుగా ఉన్న భూముల పక్కన హైవే రావడంతో యమున అత్తింటివారి భూములు రూ.కోట్ల ధర పలికాయి. డబ్బు అమాంతంగా వచ్చిపడటం, యమున ఉన్నత చదువులు చదివి ఉండడం, ఆమె భర్తకు చదువులేకపోవడం తదితర కారణాలతో కొన్ని నెలలుగా యమునను వదిలించుకోవాలని అత్తింటివారి వేధింపులు మొదలయ్యాయి. దీంతో శ్రీనివాసులు తన కుమార్తెను ఇంటికి తీసుకొచ్చాడు.
 
రాజకీయ బలగం ఉన్న యమున అత్తింటివారు. ఇటీవల ఆమెపై దాడి చేసి, మూడేళ్ల కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ విషయమై యమున తండ్రి స్థానిక దిశ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసినా రాజకీయ పలుకుబడితో కేసును నీరుగార్చారు. కళ్లెదుటే కూతురు పడుతున్న బాధను చూడలేక విశాఖ నుంచి కలిగిరి వచ్చి నాలుగు రోజులుగా తన సోదరుడి ఇంటివద్ద ఉన్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ నోట్ రాసి బుధవారం ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
భీమిలి నుంచి వచ్చిన మృతుడి భార్య కుమారుడు, కుమార్తె, బంధువులు గురువారం కలిగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. ఆత్మహత్యకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. పోస్టుమార్టం అయ్యాక మృతదేహాన్ని భీమిలి తరలించారు. 
 
ఆత్మహత్య చేసుకునేముందు శ్రీనివాసులు.. సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రులకు సూసైడ్ నోట్ రాశారు. ఆ నోట్లో తన కుమార్తెను అత్తింటి వారు ఎలా వేధించారో, తాను ఎంతటి మానసిక వేదనను గురయ్యానో వివరించాడు. తాను కూడా టీడీపీ సభ్యుడినేనంటూ, తన కుమార్తెను కాపాడాలంటూ ఐడీ కార్డుతో సహా రాసిన సూసైడ్ నోట్ స్థానికంగా సంచలనం రేపింది. ఉపాధి కోసం దూరప్రాంతానికి వెళ్లి, కుమార్తె బాధను చూడలేక స్వస్థలానికి వచ్చి శ్రీనివాసులు ఆత్మహత్య చేసుకోవడం పలువురిని తీవ్రంగా కలిచివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments