Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో మద్యం మాన్పించాలని భార్య తాగుబోతు అయ్యింది, చివరికి...

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (22:57 IST)
భర్తలో మార్పు తీసుకురావాలనుకుంది. ఎప్పుడూ మద్యం తాగుతూ ఉండే భర్త వల్ల ఇంట్లో గొడవలు జరుగుతుండడం ఆమెకు ఇష్టం లేదు. నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చే భర్త ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేదు ఆమెకు. ఒకవైపు పిల్లలు లేరు.. మరోవైపు అత్త సూటిపోటి మాటలు.. మరోవైపు తాగుడు భర్త. దీంతో ఆమె కూడా మద్యానికి బానిసైంది. చివరకు జీవితాన్ని సర్వనాశనం చేసుకుంది.

 
రాజస్థాన్ రాష్ట్రం బార్మర్‌లో నివాసముంటున్నారు అనిల్ కుమార్ - మంజు. సంవత్సరం క్రితమే వీరికి వివాహం జరిగింది. లారీ డ్రైవర్ ఉంటున్నాడు అనిల్ కుమార్. అతని తండ్రి అగ్రికల్చరర్ ప్రభుత్వ ఉద్యోగి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకపోవడంతో మంజు తల్లిదండ్రులు అనిల్‌కు ఇచ్చి వివాహం చేశారు. అయితే తండ్రి క్రమశిక్షణలో ఉన్న అనిల్ కుమార్ వివాహం ముందు వరకు మద్యం సేవించేవాడు కాదు.

 
కానీ పెళ్ళయిన తరువాత ఫ్రెండ్స్ బలవంతం పెట్టి మద్యానికి బానిస చేశారు. అదే అతని జీవితాన్ని సర్వనాశనం చేసింది. లారీ డ్రైవింగ్ వృత్తిలోకి వెళ్ళే అనిల్ కుమార్ నేరుగా ఇంటికి వచ్చి పడుకునేవాడు. నిత్యం తాగుడే తాగుడు. దీంతో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. సంవత్సరం అయినా పిల్లలు లేకపోవడంతో కోడలిని సూటిపోటి మాటలు అంటుండేది అత్త. ఆ మాటలు, భర్త తాగుడుతో ఆ వివాహిత విసిగిపోయింది.

 
తాగొచ్చిన భర్తను మారుద్దామనుకుని వైన్ షాపుకు వెళ్ళి మద్యం తెచ్చుకుని భర్త ముందు కూర్చుంది. నువ్వు మద్యం మానకుంటే నేను కూడా తాగుతానంది. నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో అన్నాడు భర్త. అంతే... ఆమె కూడా మద్యాన్ని పోసుకుని తాగడం ప్రారంభించింది. మద్యం మత్తులో ఉన్న భర్త, భార్యను పట్టించుకోవడం మానేశాడు. దీంతో భార్య కూడా మద్యానికి బానిసై తాగుబోతుగా మారిపోయింది.

 
గత వారంరోజులుగా గొడవలే గొడవలు. అయితే నిన్న మద్యం మత్తులో భార్య తన భర్తను రోకలి బండతో కొట్టి చంపేసింది. హత్యకు తనకు ఏం సంబంధం లేదని బుకాయించింది. తన భర్త మద్యం మత్తులో చచ్చిపోయాడని పోలీసుల ముందు వారించింది. అయితే బంధువుల ఫిర్యాదుతో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments