Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనీపాట లేదు, నీకు పిల్లనెవరు ఇస్తార్రా అన్నందుకు తండ్రిని, చిన్నాన్నను హత్య చేసాడు

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2022 (22:07 IST)
ఈరోజుల్లో అబ్బాయిలకు పెళ్లి కావడం అంటే మామూలు విషయం కాదు. అందునా పనిపాట లేకుండా ఆవారాగా తిరిగే వారికి పిల్లను ఎవరిస్తారు? ఇదే మాట ఆ యువకుడి తండ్రి, పినతండ్రి అన్నారు. అంతే... ఇద్దరినీ అత్యంత కిరాతకంగా హత్య చేసాడు ఆ యువకుడు.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా మోపాల్ గ్రామంలో 30 ఏళ్ల నితీష్ పనీపాట లేకుండా ఆవారా తిరుగుతున్నాడు. ఐతే తనకు పెళ్లి చేయాలంటూ తండ్రిపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నాడు. ఈ నేపధ్యంలో కుమారుడితో... నీవేమీ పనీపాట చేయడంలేదు. ఎవర్ని అడిగినా అదే మాట అంటున్నారు. నీకు పిల్లని ఇవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అంటున్నారు. 

 
నీవేమీ చేయడంలేదు, పిల్లనెవరు ఇస్తారని అన్నాడు కన్నతండ్రి. అతడి మాటలతో తమ్ముడు కూడా వత్తాసు పలికాడు. అంతే... కోపంతో ఊగిపోతూ విచక్షణ కోల్పోయిన సతీష్.. తన తండ్రితో పాటు పినతండ్రిని అతి దారుణంగా హత్య చేసాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments