నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

ఐవీఆర్
శుక్రవారం, 2 మే 2025 (22:06 IST)
సూరత్: కలికాలం సమీపిస్తున్నట్లే వున్నది. అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. వావివరసలు పోతున్నాయి. గురుశిష్యుల బంధం కొన్నిచోట్ల అపవిత్రమవుతోంది. గుజరాత్‌లోని సూరత్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల టీచర్ తనవద్ద చదువుకుంటున్న 13 ఏళ్ల విద్యార్థితో పారిపోయింది. పోలీసులు నిందితురాలైన ఉపాధ్యాయురాలిని అరెస్టు చేశారు. విచారణ సమయంలో ఆమె చెప్పిన సంగతి విని పోలీసులు షాక్ తిన్నారు. తనతో తీసుకెళ్లిన 13 ఏళ్ల విద్యార్థితో కలవడం వల్ల తను గర్భవతినయ్యాననీ, తను తల్లిని కాబోతున్నానని ఆ టీచర్ పోలీసుల విచారణలో చెప్పింది. తన కడుపులో ఐదు నెలల పిండాన్ని మోస్తున్నట్లు చెబుతోంది. అందుకే తను ఆ విద్యార్థితో పారిపోయినట్లు చెప్పింది.
 
ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత ప్రజలు షాక్ అయ్యారు. ఆ విద్యార్థితో రెండేళ్లుగా ప్రేమ వ్యవహారంలో ఉన్నానని టీచర్ చెప్పింది. ఈ సమయంలో ఆమె విద్యార్థితో శారీరక సంబంధం పెట్టుకున్నది. తరువాత ఆ టీచర్ గర్భవతి అయింది. దీని తరువాత ఆమె విద్యార్థితో పారిపోయింది. కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి తానేనని విద్యార్థి కూడా అంగీకరించాడు.
 
ఈ మొత్తం విషయంపై విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తరువాత, రాజస్థాన్ సరిహద్దులోని షామ్లాజీ నుండి నడుస్తున్న బస్సు నుండి పోలీసు బృందం ఉపాధ్యాయురాలిని, ఆమెతో పాటు వున్న విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారిద్దరూ చాలాసార్లు శారీరకంగా కలిసినట్లు ఉపాధ్యాయురాలితో పాటు బాలుడు కూడా చెప్పాడు. వైద్య పరీక్షలో సదరు విద్యార్థికి తండ్రి అయ్యే సామర్థ్యం ఉందని తేలింది. గర్భంలో ఉన్న బిడ్డకు డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తామని పోలీసులు చెబుతున్నారు. మైనర్‌ను కిడ్నాప్ చేసిందనే ఆరోపణలపై ఉపాధ్యాయురాలిపై కేసు నమోదు చేయబడింది. ఏప్రిల్ 25న లేడీ టీచర్ 13 ఏళ్ల మైనర్‌ విద్యార్థితో పారిపోయింది. విద్యార్థికి ట్యూషన్ చెప్పడానికి టీచర్ ఇంటికి వస్తుండేది. ఈ క్రమంలో అతడితో గడిపినట్లు తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం