Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీకు నేను కావాలా, ఐతే బ్లాంక్ చెక్ పైన సంతకం చేయి, అదీ లేదంటే దీనిమీద...

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (19:10 IST)
యువకులను మోసం చేసి లక్షల రూపాయల వసూలు చేసే ఒక గ్యాంగ్‌ను కర్నూలుజిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాగా డబ్బున్న యువకులనే టార్గెట్ చేసి వారితో చనువుగా మాట్లాడి ఆ తరువాత అర్థనగ్నంగా ఫోటోలు తీసి వాటిని చూపించి బెదిరించే ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. 
 
కర్నూలుకు చెందిన ఐదుగురు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరందరూ స్నేహితులే. డిగ్రీ వరకు చదువుకున్న ఈ బ్యాచ్ సులువుగా డబ్బులు సంపాదించాలని ప్లాన్  చేశారు. నిరుద్యోగ యువకులతో ఫ్రెండ్‌షిప్ ఏర్పరచుకుని ఉద్యోగం తీసిస్తానని నమ్మిస్తారు. ఆ తరువాత వారికి మొబైల్స్ తీయించి బాగా డబ్బున్న మీ స్నేహితులతో మాట్లాడమని చెబుతారు.
 
ఆ తర్వాత వీరే రంగంలోకి దిగి పదిరోజుల పాటు బాగా చనువుగా మాట్లాడతారు. ఇలా పదిమంది యువతులు కలిసి ఇప్పటికే 20 మందిని యువకులను మోసం చేశారు. యువతులు పిలిస్తే వెళ్ళకుండా ఉంటారా.. ఠక్కున వెళ్ళడం.. గదికి వెళ్ళిన తరువాత బట్టలు తీసేసి ఏదో చేయాలని ముందుకు వెళ్లబోవడం. అంతే.. అక్కడే ఆపేసి, నేను కావాలంటే కొన్ని షరతులున్నాయి.
 
బ్లాంక్ చెక్ ఇవ్వు, అది లేదంటే ఇదిగో ఈ ప్రామిసరీ నోటుపైన సంతకం చేయి అని మత్తుగా అడిగేసరికి వారు కాస్తా సంతకాలు చేసేస్తారు. ఈలోపు అటు పక్కనే వున్న మరికొందరు యువతులు అండర్‌వే పైన వున్న యువకుల ఫోటోలను లాగేస్తారు. సదరు కుర్రాడు గది లోపలికి వెళ్లబోతే... చెక్ పైన రాసిన అమౌంట్ వచ్చాక చూద్దాంలే అని పంపేస్తారు. ఆలోపు డబ్బు ఇవ్వకపోతే.. ఆ యువకుడు నగ్న ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టారు.
 
ఇలా కొంతమంది యువకుల నుంచి ప్రామిసరీ నోట్లు, ఐదు చెక్కులు, 8 లక్షల రూపాయల విలువచేసే నగలు, 18 లక్షల రూపాయల నగదును తీసుకున్నారు. డబ్బున్న యువకులు తమ అర్థనగ్న ఫోటోలు బయటకు వస్తే ఎక్కడ పరువుపోతోందోనని.. ఇంట్లో వారు ఎలా స్పందిస్తారోనన్న భయంతో ఈ ముఠా అడిగినంత డబ్బులు ఇచ్చేసారు.
 
ఒక యువకుడి ఫిర్యాదుతో పోలీసులు ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులను మీడియా ముందుంచారు. యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు పంపించేశారు. ఉద్యోగం కోసం పెడదారి పట్టవద్దని యువతులను హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments