Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

ఠాగూర్
సోమవారం, 2 జూన్ 2025 (09:52 IST)
టీడీపీ పాలిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. నిమ్మతోటలో పనిచేసే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. కత్తితో పొడిచి చంపేసిన తర్వాత కూడా కసి తీరకపోవడంతో మృతదేహాన్ని రెండు రోజులు పాటు ముక్కలు ముక్కలుగా నరికి, ఆ శరీర భాగాలను బోరుబావిలో పడేశాడు. ఈ దారుణ హత్య నెల్లూరు జిల్లా లింగసముద్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
లింగసముద్రం మండలం, జపాలవారి పాలెంకు చెందిన టీడీపీ నేత తోవూరి నరసింహం. ఈయనకు నిమ్మతోటవుండగా, అందులో బ్రహ్మయ్య అనే వ్యక్తి పని చేస్తున్నాడు. వీరిద్దరి ఏం జరిగిందో తెలియదుకానీ, నరసింహంను బ్రహ్మయ్య కత్తితో పొడచి హత్య చేశాడు. 
 
ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి బావిలోపడేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నరసింహం‌ను బ్రహ్మయ్య ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశాడన్నది మిస్టరీగా మారింది. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులుకేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. బోరుబావి వద్ద సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివ కందుకూరి, రాజీవ్ కనకాల చాయ్ వాలా ఫస్ట్ లుక్

సత్యదేవ్, ఆనంది కాంబినేషన్ లో వచ్చిన అరేబియా కడలి రివ్యూ

అపరిచితులుగా కలిసిన ప్రేమికులుగా మారిన కాన్సెప్ట్ తో కపుల్ ఫ్రెండ్లీ

సూపర్ స్టార్ తెలుగు సినిమాకు గర్వకారణం అంటు దీవెనలు ఇచ్చిన మెగాస్టార్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments