Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతలు వేధించారంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన యువకుడు తెల్లారేసరికి శవమై తేలాడు...

ఠాగూర్
సోమవారం, 27 జనవరి 2025 (19:55 IST)
వైకాపా నేతలు తనను వేధించారంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన ఓ యువకుడు తెల్లాసరికి రైలు పట్టాల మధ్య శవమై కనిపించాడు. ఈ దారుణం అనంతపురం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తి గ్రామానికి చెందిన టి.మహేశ్వర రెడ్డి (24) శనివారం రాత్రి పాలచెర్లకు చెందిన మురళి అనే యువకుడితో కలిసి సోములదొడ్డి గ్రామంలోని బస్టాపు వద్దకు వెళ్లాడు. 
 
అక్కడ నుంచి తనకు పని ఉందని, అది పూర్తి చేసుకుని మళ్లీ ఫోన్ చేస్తానని మహేశ్వర రెడ్డి తన వెంట వచ్చిన యువకుడికి చెప్పడంతో అతడు అక్కడి నుంచి అనంతపురం వెళ్లాడు. పని పూర్తయిందని, సోములదొడ్డికి రావాలని రాత్రి 10.30 గంటల సమయంలో మహేశ్వర రెడ్డి ఫోనులో సందేశం పంపాడు.
 
దీంతో మురళి ద్విచక్ర వాహనంపై సోములదొడ్డికి వచ్చాడు. అయితే అక్కడ మహేశ్వర రెడ్డి కనిపించలేదు. ఫోన్‌చేస్తే స్విచాఫ్ వచ్చింది. అనుమానం రావడంతో అతడు.. మహేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులకు ఫోన్ చేసి చెప్పగా వారు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో సోములదొడ్డి, నాగిరెడ్డి గ్రామాల మధ్య రైలు పట్టాల పక్కన ఆదివారం ఉదయం శవమై కనిపించాడు. దీన్ని రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
 
2019లో టీడీపీకి సహకరించామనే కారణంతో తన కుమారుడిపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి కోపం పెంచుకున్నారని, వైకాపా హయాంలో అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారని మహేశ్వర రెడ్డి తండ్రి మల్లిరెడ్డి మీడియా ముందు వాపోయారు. 
 
అలాగే తమ భూమిని కూడా ఆన్‌లైన్ రికార్డుల నుంచి తొలగించారని వెల్లడిచారు. ఈ యేడాది జనవరి ఒకటో తేదీన పరిటాల శ్రీరామ్‌ను కలిసి తన కుమారుడు ఫోటోలు తీసుకుని, ఆ ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెట్టాడని, అప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు మల్లిరెడ్డి ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments