Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు తీసుకున్న బెంగుళూరు యువతి హత్య కేసు నిందితుడు!

ఠాగూర్
గురువారం, 26 సెప్టెంబరు 2024 (11:34 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగుళూరు యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న ముక్తిరంజన్ రాయ్ బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఒరిస్సా రాష్ట్రంలోని భద్రక్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన ఈ నిందితుడు బుధవారం ఓ చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ హత్య తర్వాత వివిధ ప్రాంతాల్లో పర్యటించి బుధవారం స్వగ్రామం పాండికి చేరుకున్న ముక్తిరంజన్ రాయ్.. బుధవారం ఇంటిలోనే ఉన్నడు. ఆ తర్వాత బైకుపై వెళ్లి ప్రాణాలు తీసుకున్నట్టు స్థానికులు తెలిపారు. 
 
బెంగళూరులో మహాలక్ష్మి (26) అనే యువతిని కిరాతకంగా హత్య చేసి ముక్కలుగా నరికి, ఫ్రిజ్‌లో ఉంచిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడి కోసం ఒడిశా, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడు ముక్తిరంజన్ రాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 
 
బెంగళూరులోని బాధితురాలకి ఉన్న ముగ్గురు ముఖ్యమైన స్నేహితుల్లో ఒకడైన ముక్తిరంజన్ రాయ్.. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్నాడు. బెంగళూరులోని నెలమంగల సమీపంలో యువతిని ముక్కలుగా నరికి, రిఫ్రిజిరేటర్‌లో కుక్కి.. 'సడోమా సూకిస్ట్క్' అనే నేరస్వభావంతో నిందితుడు రగిలిపోయినట్లు వైద్య నిపుణులు గుర్తించారు.
 
బుధవారం పాండి గ్రామానికి చేరుకున్న ముఖిరాజన్ ఇంట్లోనే ఉన్నాడు. ఆ తర్వాత బైకుపై బయటకు వెళ్లాడు. స్థానికులు అతడి మృతదేహాన్ని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, మహాలక్ష్మి చివరిసారి ఈ నెల 1వ తేదీన డ్యూటీ చేసింది. 2 లేదంటే 3న నిందితుడు ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. త్రిపురకు చెందిన మహాలక్ష్మి పనిచేస్తున్నచోట ముక్తిరంజన్ రాయ్ విభాగ అధిపతిగా పనిచేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments