Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళను హింసించి చంపేశారు.. అరుపులు వినిపించకుండా...

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (13:31 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో దారుణం జరింగి. ఓ మహిళను హింసించి చంపేశారు. ఈ దారుణానికి ఆమె బంధువులే పాల్పడ్డారు. బ్లేడుతో శరీరంపై కోస్తూ, ఇనుప రాడ్లతో ఆమెను కుళ్లబొడుస్తుంటే భరించలేని ఆమె పెడుతున్న కేకలు బయటకు వినిపించకుండా పెద్ద శబ్దంతో పాటలు పెట్టి జాగ్రత్తలు తీసుకున్నారు.
 
ఆమె చనిపోయిన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. పక్కింటి నుంచి రెండు రోజులుగా పెద్ద శబ్దంతో మ్యూజిక్ వినిపిస్తుండడంతో అనుమానించిన ఇరుగు పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 
ఘజియాబాద్‌లో ఉండే బంధువులు హీనా, రమేశ్ దంపతుల తనయుడి పుట్టినరోజు వేడుక కోసం వాళ్లింటికి సమినా అనే యువతి వెళ్లింది. అదేసమయంలో వారింట్లో రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. దీంతో వారు సమీనానే వాటిని దొంగిలించిందని భావించి ఆమెను పట్టుకుని కర్రలు, రాడ్లతో చితకబాదారు. 
 
నిజం ఒప్పుకోవాలంటూ బ్లేడుతో శరీరంపై కోస్తూ చిత్రవధ చేశారు. ఆమె అరుపులు పక్కింటి వాళ్లకు వినిపించకుండా పెద్ద శబ్దంతో పాటలు పెట్టారు. వారి టార్చర్ భరించలేని ఆమె ప్రాణాలు కోల్పోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. హడావుడిలో మ్యూజిక్ ఆఫ్ చేయడం మర్చిపోయారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

తెలంగాణలో సినిమా అభివృద్ధి కాకపోవడానికి కారకులు ఎవరు?

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments