Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి చూపులకు వచ్చాడు, అమ్మాయి అందంగా కనిపించింది, ఆ తర్వాత?

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (22:20 IST)
పెళ్ళి చూపులకు వచ్చాడు. అమ్మాయి అందంగా కనిపించింది. ఆమె తల్లిదండ్రులను ఒప్పించి మాట్లాడాలన్నాడు. మాటలు కలిపాడు. చాలా అందంగా ఉన్నావని చెప్పాడు. ఎన్నో మాటలు చెప్పాడు. ఆమె నమ్మేసింది. నిన్ను తప్ప ఎవరినీ పెళ్ళి చేసుకోనన్నాడు. కట్నం అసలు వద్దన్నాడు. ఆమె ఎగిరి గంతేసినంత ఆనందపడింది. పెళ్ళయ్యింది. కానీ ఆ తరువాతే అతనిలోని బుద్ధి బయటపడింది.

 
విశాఖ జిల్లా రవీనాకు చెందిన ఉమ్మడి కిషోర్ కుమార్, సత్యవతిలకు నవంబర్ నెలలో వివాహం జరిగింది. సత్యవతి తల్లిదండ్రులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. కిషోర్ కుమార్ మాత్రం ఆస్తిపరుడు. అయితే అమ్మాయి నచ్చితే చాలు అనుకుని పెళ్ళి చూపులకు వెళ్ళాడు.

 
పెళ్ళి చూపుల్లోనే అమ్మాయిని చూసి ఫిదా అయ్యాడు. మాటలు కలిపాడు. ఎంతో అందంగా ఉన్నావని.. నిన్నే పెళ్ళి చేసుకుంటానన్నాడు. దీంతో సత్యవతి తన కుటుంబ పరిస్థితిని వివరించింది. తల్లిదండ్రులు అప్పు చేసి నా పెళ్ళి చేయాలనుకుంటున్నారు. కట్నం తీసుకోకుంటే బాగుంటుంది అని చెప్పింది. దీంతో సరేనన్నాడు. వివాహం బాగా జరిగింది. కానీ ఆ తరువాత కట్నం కోసం వేధించడం మొదలెట్టాడు.

 
కిషోర్ కుమార్ సత్యవతిని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇల్లు కొనుక్కోవాలి 40 లక్షలు డబ్బులు కావాలని.. కారు కొనుక్కోవాలని.. నగలు కావాలని ఇలా హింసించేవాడు. దీంతో సత్యవతి తీవ్ర ఆవేదనకు గురైంది.

 
భర్తను ప్రాధేయపడింది. అయినా అతను మారలేదు. కట్నం కావాలని ఒంటి కాలిపై కూర్చున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆ వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసు విచారణలో కట్నం కోసమే వేధించాడని తేలడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments