Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్న డ్రమ్ములో ఉన్నాడు... తండ్రి హత్యపై ఆరేళ్ళ పాప నోట నుంచి వచ్చిన నిజం..

ఠాగూర్
గురువారం, 20 మార్చి 2025 (14:42 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ హత్య కేసులో సంచలన నిజం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ళ కుమార్తె పుట్టిన రోజు కోసం లండన్ నుంచి స్వదేశానికి వచ్చిన సౌరభ్... తన కన్నబిడ్డ ముందే కట్టుకున్న భార్య తన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. భర్త శవాన్ని 15 ముక్కలు చేసి ఓ డ్రమ్ములో ఉంచి సిమెంట్‌తో సమాధి చేశారు. కొడుకు కనిపించడం లేదంటూ సౌరభ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. కొడుకు కనిపించడం లేదంటూ సౌరభ్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ హత్య కేసు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
అయితే, ఈ హత్యను కళ్ళారా ఆరేళ్ల చిన్నారి చూసింది. తన తల్లి మరో వ్యక్తితో కలిసి తండ్రిని హత్య చేసి, మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో దాచడం గమనించింది. అయితే, అది దాచడం కాదని, నాన్నను చంపేశారని ఆ చిన్నారికి తెలియదు. మీ నాన్న ఏరమ్మా అని అడిగిన చుట్టుపక్కల వాళ్లకు నాన్న డ్రమ్ములో ఉన్నాడు అంటూ సమాధానం చెప్పింది. ఆ మాటల వెనుకున్న విషాదం తెలియక ఆ చిన్నపిల్ల ఏదో చెబుతోందని వారంతా మిన్నకుండిపోయారు. కానీ, నిజంగానే ఆ పాప తండ్రి నిర్జీవంగా మారి డ్రమ్ములో సమాధి అయ్యాడని వారు ఊహించలేక పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Shankar: అవతార్ లాగా తన కలల ప్రాజెక్ట్ వేల్పారి చేయబోతున్న తమిళ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments