Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మంలో మెడికో విద్యార్థిని ఆత్మహత్య .. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది..

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (10:29 IST)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. 22 యేళ్ల సముద్రాల మానస అనే విద్యార్థిని స్థానికంగా ఉండే మమత బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతుంది. ఆమె తాను ఉండే హస్టల్ గదిలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబ కలహాలే ఆమెను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మానస ఉండే హాస్టల్ గది నుంచి కాలుతున్న వాసన వస్తుండటంతో సహచర విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులు వచ్చి చూడగా, ఆమె గదిలో పొగలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు గది తలుపులు పగులగొట్టి లోపలకి వెళ్లారు. అప్పటికే మంటల్లో కాలిపోతున్న మానసపై నీళ్లుపోసి కాపాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మానస మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 
 
ఓ పెట్రోల్ బంకు నుంచి మానస పెట్రోల్ కొనుగోలు చేసి వెళుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మానస తండ్రి ఇటీవలే చనిపోయారు. ఆ బాధ నుంచి ఆమె కోలుకోలేకపోయింది. తరచూ తండ్రిని తలచుకుని బాధపడుతూ ఉండేది. తండ్రిలేని బాధను తట్టుకోలేక మానస ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments