Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిఫ్ట్ ఇచ్చిన పాపానికీ అనంతవాయువుల్లో కనిసిపోయాడు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (08:33 IST)
ఓ పాదాచారికి లిఫ్టు ఇచ్చిన పాపానికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆయన కుటుంబం ఇపుడు అనాథగా మిలిగిపోయింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ (48) అనే వ్యక్తి జగ్గయ్యపేట మండలం గండ్రాయిలో తన పెద్ద కుమార్తె వద్ద తన భార్య ఇమాంబీని తీసుకొచ్చేందుకు బైకుపై బయలుదేరాడు. 
 
మార్గమధ్యంలో ముదిగొండ మండలంలోని పల్లభి సమీపంలో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై నిలబడి లిప్ట్ అడిగారు. తమ బైకులో పెట్రోల్ అయిపోయిందని, తమలో ఒకరికి లిఫ్ట్ ఇస్తే పెట్రోలు తెచ్చుకుంటామని చెప్పడంతో జమాల్ సరేనని వారిని ఎక్కించుకున్నాడు. 
 
కొంతదూరం వెళ్లిన తర్వాత వెనుక కూర్చొన్న వ్యక్తి జమాల్‌కు ఓ ఇంజెక్షన్ సూది వేశాడు. దీంతో ఏం చేశావని ప్రశ్నించడంతో వెనుక కూర్చొన్న వ్యక్తి బైకు దిగి పరుగెత్తి.. వెనుకనే ఉన్న మరో బైక్ ఎక్కి పారిపోయాడు. 
 
అప్పటికే కళ్లు తిరగిపోతుండటంతో బైకును రోడ్డు పక్కన ఆపి స్థానికుల నుంచి నీళ్లు ఇప్పించుకుని తాగాడు. వారితోనే తన భార్యకు ఫోన్ చేసి జరిగిన విషయం తెల్సిందే. ఆ వెంటనే జమాన్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇంజెక్షన్ వేసేందుకు వాడిన సిరంజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో పిచ్చి కుక్కలను చంపేందుకు వాడే రసాయనాన్ని ఇంజక్షన్‌లో ఎక్కించినట్టు గుర్తించారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments