Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. నిందితులంతా సహచరులే...

ఠాగూర్
శనివారం, 24 మే 2025 (11:18 IST)
కర్నాటక రాష్ట్రంలోని బెళగావిలో దారుణం జరిగింది. వైద్య విద్యార్థినిపై సహచర విద్యార్థులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటకలోని బెళగావికి చెందిన 22 యేళ్ల బాధితురాలు మహారాష్ట్రంలోని సాంగ్లి జిల్లాలో ఎంబీబీఎస్‌ తృతీయ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తోంది. ఈ నెల 18వ తేదీన రాత్రి 10 గంటలకు తన సహచర విద్యార్థులతో కలిసి సినిమా చూడాలని భావించింది.
 
అయితే, వారిలో ఒకరు ఆమెను తన ప్లాట్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఓ వైద్య విద్యార్థితో పాటు ఓ యువకుడు కూడా ఉన్నారు. వీరంతా అప్పటికే మద్యం సేవసించివున్నారు. గదికి వచ్చిన వైద్య విద్యార్థినికి కూడా స్పైక్డ్ డ్రింక్ ఇచ్చారు. అది తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ యువతి స్పృహలోకి వచ్చిన తర్వాత తనకు జరిగిన ఘోరాన్ని తెలుసుకుని వారిని నిలదీసింది. దాంతో ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ ముగ్గురు నిందితులు బెదిరించారు. కానీ, బాధిత యువతి తనకు జరిగిన ఘోరాన్ని తన తల్లిదండ్రులకు చేరవేసింది. దీంతో వారు విశ్రాంబాగ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితులపై బీఎన్ఎస్ సెక్షన్ కింద గ్యాంగ్ రేప్, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
నిందింతులు ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు పూణె, షోలాపూర్, సాంగ్లికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా 20 నుంచి 22 యేళ్లలోపువారేనని వెల్లడించారు. వీరిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం