మధ్యప్రదేశ్‌లో కిరాతక చర్య : కండువా ఇవ్వలేదని భార్య హత్య

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (17:20 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. స్నానం చేసిన తర్వాత చేతికి కండువా ఇవ్వలేదన్న కోపంతో భార్యపై 50 యేళ్ల వ్యక్తి దాడి చేసి చంపేశాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని బాలాఘాట్ జిల్లా కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హీరాపూర్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ బహే (50) అనే వ్యక్తి అటవీ శాఖ అధికారిగా పని చేస్తున్నారు. రాజ్‌కుమార్ స్నానం చేసిన తర్వాత టవల్ ఇవ్వాలని అతని భార్య పుష్పా బాయి (45)ని అడిగాడు. కానీ ఆమె టవల్ ఇవ్వలేదు. ఇంటి పని చేస్తున్నట్టు సమాధానమిచ్చింది. 
 
దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ కుమార్ తన భార్య తలపై పారతో పదే పదే కొట్టడంతో ఆమె అక్కడే ప్రాణాలు విడించింది. దీనిపై సమాచారం అందుకున్న కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర కుమార్ బారియా ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 
 
కాగా, తల్లిపై తండ్రి దాడి చేస్తుండగా, 23 ఏళ్ల కుమార్తె అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆమెను బెందిరంచాడని ఇన్‌స్పెక్టర్ చెప్పాడు. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడిని ఆదివారం అరెస్టు చేశామని, అతనిపై హత్య కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments