Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోదరిని కలవకుండా అడ్డుకున్న అన్నయ్య: కత్తితో పొడిచి చంపేసిన ఇద్దరు మైనర్లు

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (15:07 IST)
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌ఘర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం జరిగింది. సోదరిని కలవకుండా అడ్డుకున్నంటున్న 15 ఏళ్ల బాలుడిని ఇద్దరు మైనర్లు కత్తితో పొడిచి హత్య చేశారు. 
 
ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. దీని వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 17 ఏళ్ల వయస్సు గల ఇద్దరు నిందితులైన బాలురు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 
 
మృతుడు, 9వ తరగతి చదువుతున్న విద్యార్థి, భోజన విరామ సమయంలో పాఠశాల ఆవరణలో ఉన్నప్పుడు ఇద్దరు నిందితులు అక్కడికి చేరుకుని అతనితో వాగ్వాదానికి దిగారు. అకస్మాత్తుగా, ఒక నిందితుడు బాలుడి పొత్తికడుపులో కత్తితో పొడిచాడు. అక్కడి నుండి తప్పించుకునే ముందు, ఇద్దరూ స్కూల్ సిబ్బందిపై కత్తిని కూడా విసిరారు.
 
బాధితుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడి సోదరి, అదే పాఠశాలలో చదువుతోంది. ఈమె కోసమే వారు ఈ దారుణానికి పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇద్దరు నిందితులు కూడా తన సోదరుడిని పాఠశాల ఆవరణలో కొట్టారని పోలీసులకు సమాచారం అందించారు.
 
మంగళవారం జరిగిన సంఘటన తర్వాత, పరారీలో ఉన్న నిందితుల కోసం రాయ్‌గఢ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ మీనా వెంటనే నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు.
 వారిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments