Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూది హత్యకు సూత్రధార భార్యే - అక్రమ సంబంధమే కారణం

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (11:03 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరో అక్రమ సంబంధ హత్య జరిగింది. తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్య కడతేర్చింది. ఈ కేసులో పోలీసులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ (48) అనే వ్యక్తి తాపీమేస్త్రీగా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య షేక్ ఇమాంబీ (46). ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్ళిళ్లు చేశారు. ఇమాంబీ వ్యవసాయ కూలీల ముఠా మేస్త్రీగా కొనసాగుతుంది. 
 
ఈ క్రమంలో ప్రతి రోజూ కూలీలను తీసుకెళ్లే క్రమంలో నామవరం ఆటో డ్రైవర్ గోదా మోహన్ రావుతో గత రెండేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. ఓ రోజున తన ఇంట్లో భార్యతో మోహన్ రావు సన్నిహితంగా ఉండటాన్ని జమాల్ సాహెబ్ చూసి భార్యను మందలించాడు. అప్పటి నుంచి భర్తపై కక్ష పెంచుకున్న ఇమాంబీ.. కట్టుకున్న భర్తను చంపేందుకు ప్రియుడు మోహన్ రావును ప్రేరేపించింది. 
 
ఇందుకోసం తమ కుట్రలో భాగంగా అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు బండి వెంకన్నను సంప్రదించిన మోహన్ రావు.. ప్రాణాలు తీయగల సూది మందు కావాలని అడిగి, అందుకు రూ.3500 అడ్వాన్స్ కూడా చెల్లించాడు. ఆ తర్వాత జమాల్‌ను చంపేందుకు మోహన్ రావు తన స్నేహితుడైన సాంబశివరావు అనే వ్యక్తి సాయం తీసుకున్నాడు. 
 
సాంబశివ రావు ద్వారా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెండు ఇంజెక్షన్లు తెచ్చి మోహన్ రావుకు ఇచ్చాడు. ఇంజెక్షన్లు, మత్తు మాత్రలను తన స్నేహితుడై ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేశ్ ద్వారా తన ప్రియురాలైన ఇమాంబీకి చేర్చాడు. తొలుత మత్తు మాత్రలు వేసి, ఆ తర్వాత విషపు ఇంజెక్షన్ వేయాలని చెప్పాడు. ఇమాంబీకి సాధ్యపడక పోవడంతో వాటిని తిరిగి మోహన్ రావు వద్దకే చేర్చింది. 
 
ఇదిలావుంటే, ఇటీవల ఏపీలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయిలో ఉంటున్న తన కుమార్తె ఇంటికి వెళ్లింది. అక్కడికి చేరుకున్న మరుసటి రోజు నుంచి తనను వచ్చి తీసుకెళ్లాలంటూ భర్తకు పదేపదే ఫోన్ చేసి కోరింది. దీంతో జమాల్ ఈ నెల 18వ తేదీన ఉదయం ద్విచక్రవాహనంపై గండ్రాయికి బయలుదేరాడు. ఈ సమాచారాన్ని ఇమాంబీ తన ప్రియుడు మోహన్ రావుకు ముందు రోజే చేరవేసి, తన భర్తను చంపేయాలని ప్రోత్సహించింది. 
 
దీంతో ఆ పనిని ఆర్ఎంపీ వైద్యుడు వెంకన్న, తన స్నేహితుడు వెంకటేశ్‌లకు అప్పగించాడు. వారిద్దరూ ముదిగొండ మండలం వల్లభి వద్ద కాపు కాశారు. తొలుత జమాల్ అనుకుని మరో వ్యక్తిని ఆపారు. ఆ తర్వాత అతను కాదని నిర్థారించుకున్న తర్వాత మిన్నకుండి పోయారు. ఆ తర్వాత జామల్‌ను వెంకన్న లిఫ్టు అడిగి బైక్ ఎక్కి కూర్చొన్నాడు. కొంత దూరం వెళ్లాక ఇంజక్షన్ వేసి వెంటనే దిగి పారిపోయాడు. ఆ తర్వాత జమాల్ ఆస్పత్రికి వెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వివరించారు. 
 
హంతకుడు అపరిచితుడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఇమాంబీ ఫోన్ కాల్ లిస్టును పరిశీలించారు. ఇందులో హత్య జరిగిన రోజు తెల్లవారుజాము ఆమె ప్రియుడు మోహన్ రావుకు, వెంకటేశ్‌లకు పలుమార్లు ఫోన్ చేసినట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం తేలింది. దీంతో ఇమాంబీతో పాటు మోహన్ రావు, బండి వెంకన్న, నర్శింశెట్టి వెంకటేశ్, బందెల యశ్వంత్, పోరళ్ల సాంబశివరావులను అరెస్టు చేశారు. హత్య జరిగిన 48 గంటల్లోనే ఈ కేసున ఛేదించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రెండ్ కి తగ్గట్టుగా పండు చిరుమామిళ్ల ప్రేమికుడు రాబోతుంది

సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ శంబాల లో ఆది లుక్

రియ‌ల్ కోర్ట్ డ్రామా థ్రిల్ల‌ర్ గా లీగ‌ల్లీ వీర్

Rashmika Mandanna: ఎయిర్ పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఏదో నడుస్తోందా? (video)

ఈ తరానికి స్పెషల్ ట్రీట్‌గా వారధి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments