Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై అఘాయిత్యం... ఉపాధ్యాయుడికి 111 యేళ్ల జైలు

ఠాగూర్
బుధవారం, 1 జనవరి 2025 (10:52 IST)
మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో ఓ ఉపాధ్యాయుడుకి 111 యేళ్ళ జైలుశిక్షను కోర్టు విధించింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ కేసులో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ శిక్షను విధించింది. అలాగే, 1.05 లక్షల అపరాధం కూడా విధించింది. జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో యేడాది పాటు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించింది.
 
గత 2019 జూలై రెండో తేదీన నిందితుడు మనోజ్ (44) ఐదేళ్ల క్రితం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేసే విద్యార్థిని మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య ఆత్మహత్య చేసుకుంది.
 
ఈ కేసును విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడుపై ఏమాత్రం కరుణ చూపాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి ఆర్ రేఖ పేర్కొంటూ 111యేళ్ళ జైలుశిక్ష విధించారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన నిందితుడు తన ఇంటి వద్ద ట్యూషన్లు చెప్పేవాడు. ఈ క్రమంలో ప్రత్యేక క్లాస్ పేరుతో బాధిత బాలికను ఇంటికి పిలిపించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా, ఆ దారుణాని మొబైల్‌ ఫోనులో చిత్రీకరించాడు. తాజాగా ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తుదితీర్పును వెలువరిస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం