Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో ఉన్న మహిళను గదికి తీసుకెళ్లి అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (16:55 IST)
ఇంగ్లండ్‌లో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు. మద్యం మత్తులో ఉన్న ఓ మహిళను తన రూమ్‌కు తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. యేడాది క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయగా.. న్యాయస్థానం ఏడేళ్ల జైలుశిక్ష విధించినట్లు కార్డిఫ్‌ పోలీసులు వెల్లడించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రీత్‌ వికల్‌ అనే 20 ఏళ్ల యువకుడు సౌత్‌వేల్స్‌లోని కార్డిఫ్‌ ప్రాంతంలో ఉంటున్నాడు. గత ఏడాది జూన్‌ నెలలో అతడు నైట్‌ క్లబ్‌కు వెళ్లాడు. అదే సమయంలో ఓ మహిళ కూడా వేరే బృందంతో కలిసి అదే క్లబ్‌కు వెళ్లింది. ఇద్దరూ అక్కడ కలుసుకున్నారు. క్లబ్‌లో ఆ మహిళ మద్యం ఎక్కువగా తాగేసింది. ఆ మత్తులో వికల్‌, ఆ మహిళ ఇద్దరూ.. వాళ్ల గ్రూప్‌లను వదిలేసి బయటకి వచ్చేశారు. 
 
ఆ తర్వాత వికల్‌ ఆమెను తన రూమ్‌కి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళను వికల్‌ క్లబ్‌ నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా అక్కడ ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. అతడిపై వాలిపోయి నడుస్తున్న మహిళను తొలుత తన చేతులపై తీసుకెళ్లిన యువకుడు.. ఆ తర్వాత ఆమెను భుజాలపై ఎత్తుకెళ్లినట్లు సీసీకెమెరాల్లో నమోదైంది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచగా అతడికి న్యాయస్థానం తాజాగా ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబు కు ఈడీ నోటీసులు వల్ల ప్రయోజనం ఏమిటి?

మహేష్ బాబుకు షాక్- ఈడీ నోటీసులు జారీ.. 27న విచారణకు హాజరు

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments