Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అఘాయిత్యం : పెళ్లి చేసుకోమన్న ప్రియురాలు... చంపేసిన ప్రియుడు..

ఠాగూర్
గురువారం, 21 నవంబరు 2024 (12:07 IST)
హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ బాలికపై ప్రియుడు అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక తనను పెళ్ళి చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చాడు. అంతే.. తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రియుడు.. తన స్నేహితులు, కుటుంబ సభ్యుల సాయంతో ఆ యువతిని గొంతు పిసికి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పోలీసుల కథనం మేరకు.. మియాపూర్ టీఎన్ నగర్‌కు చెందిన దంపతుల కుమార్తె(17) ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉంటోంది. ఏడు నెలల క్రితం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉప్పుగూడకు చెందిన బ్యాండ్ వాయించే విఘ్నేశ్ అలియాస్ చింటూ(22)తో పరిచయం ప్రేమగా మారింది. అక్టోబరు 20న ఆమె ఇల్లు వదిలి ఉప్పుగూడ వెళ్లింది.
 
చింటూ ఛత్రినాకలోని హనుమాన్ నగరులో ఉండే తన స్నేహితుడు మీర్‌పేటకు చెందిన సాకేత్ ఇంటికి బాలికను తీసుకెళ్లాడు. సాకేతు వివాహమైంది. ఇల్లు చిన్నదవడంతో నలుగురు ఉండడం సాధ్యం కాలేదు. దీంతో అందరూ మీర్‌పేటలోని శ్రీదత్తనగరులో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. బాలిక తన స్నేహితులతో ఉంటున్నానని తల్లి, సోదరికి సమాచారం ఇచ్చింది. 
 
ఆమెను పెళ్లిచేసుకుంటానని నమ్మించిన చింటూ అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లికి ఆమె ఒత్తిడి తేగా అద్దె గదిలోనే దండలు మార్చుకున్నారు. ఇలా కాదని పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలో జరగాలంటూ బాలిక మరింత ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో బాలిక ఇన్‌స్టా గ్రామ్‌లో మరొకరితో మాట్లాడుతోందని అనుమానించి ఈ నెల 8న గొడవ పడి తలను గోడకు కొట్టి చంపేశాడు. అనంతరం సాకేత్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై శ్రీశైలం జాతీయ రహదారి తుక్కుగూడ సమీపంలో ప్లాస్టిక్ వ్యర్థాల పరిశ్రమ తుక్కులో మృతదేహాన్ని పడేశారు. ఎవరికి కనిపించకుండా చెత్తతో కప్పేసి వెళ్లిపోయారు.
 
ఈ నెల 8 వరకు బాలిక తరచూ తల్లితో ఫోనులో మాట్లాడేది. తర్వాత ఫోన్ స్విచాఫ్ అయింది. చింటూ ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాలిక తన దగ్గరలేదని, ఫోన్ పనిచేయట్లేదు, మీ ఇంటికి వచ్చిందా..? అని అడిగాడు. రెండు రోజులు గడిచినా కుమార్తె రాకపోవడంతో తల్లిదండ్రులు 10న మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింటూను పోలీసులు విచారణకు పిలవగా వస్తున్నానని చెప్పి రెండు రోజుల తర్వాత ఫోన్ స్విచాఫ్ చేశాడు. ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments