Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి ప్రియుడిని రెండో ప్రియుడితో హత్య చేయించిన వివాహిత

Webdunia
గురువారం, 12 మే 2022 (09:29 IST)
ఓ వివాహిత చెడు మార్గం ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. తన అక్రమ సంబంధం గుట్టు బయటపడుతుందని భయపడి తన తొలి ప్రియుడిని రెండో ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ కేసులో వారిద్దరితో హత్యకు సహకరించిన మరో వ్యక్తి ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఈ దారుణం హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మీర్‌పేటలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
మీర్‌పేట ప్రశాంతి హిల్స్‌కు చెందిన 32 యేళ్ళ శ్వేతారెడ్డి అనే వివాహితకు ఫేస్‌బుక్ ద్వారా బాగ్ అంబర్‌పేటకు చెందిన యశ్మకుమార్ (32) అనే వ్యక్తితో 2018లో పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ముదిరిపాకనపాడటంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. ఓ రోజున తన ప్రియుడి కోరిక మేరకు శ్వేతారెడ్డి నగ్నంగా వీడియో కాల్ చేసింది. దీన్ని రికార్డు చేసిన యశ్మకుమార్... ఆ తర్వాత బెదిరింపులకు దిగాడు. 
 
తన అక్రమ సంబంధం గుట్టు బయటపడుతుందని ఆందోళనకు గురైంది. ఈ క్రమంలో శ్వేతారెడ్డికి ఫేస్‌బుక్‌ ద్వారా కృష్ణా జిల్లా తిరుపూరుకు చెందిన అశోక్ (28) అనే వ్యక్తితో పరిచయమైంది. అయితే, తన మొదటి ప్రియుడి వేధింపుల విషయాన్ని అశోక్‌కు చెప్పింది. అశోక్ తన స్నేహితుడు కార్తీక్‌కు కలిసి ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. 
 
అదే రోజు రాత్రి యశ్మకుమార్‌ను శ్వేతారెడ్డి ప్రశాంతి హిల్స్‌కు రప్పించి, రెండో ప్రియుడు అశోక్‌కు చేరవేసింది. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న అశోక్ సుత్తితో యశ్మకుమార్ తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 
 
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శ్వేతారెడ్డి తన ప్రియుడు అశోక్, కార్తీక్‌లతో కలిసి హత్య చేసినట్టు తేలడంతో ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments