Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసిన పూజారి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (14:07 IST)
తెలంగాణ రాష్ట్రంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాలే వీటికి ప్రధాన కారణంగా ఉంది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను ఆలయ పూజారి దారుణంగా హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ శంషాబాద్ పరిధిలో వెంకట సాయి సూర్య కృష్ణ అనే వ్యక్తి ఆలయ పూజారిగా పని చేస్తున్నారు. ఈయన తన ఆలయానికి వచ్చే అప్సర అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఆమె తనను పెళ్ళి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయసాగింది. 
 
నిజానికి పూజారికి అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టిన పూజారి.. ఆ మహిళతో గుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధం సాగిస్తూ వచ్చాడు. 
 
అయితే, వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆ మహిళను కారులో ఎక్కించుకొని వచ్చి శంషాబాద్ పరిధిలోని నర్కుడ వద్ద తలపై రాయితో మోది హత్య చేసాడు. అనంతరం మృతదేహాన్ని కవర్లో కట్టి కారులో తీసుకెళ్లి సరూర్నగర్‌లోనే మ్యాన్ హోల్లో పడేశాడు.
 
ఆ తర్వాత ఏమి ఎరగనట్లు మహిళ కనిపించడం లేదని ఆర్జీఐఏ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అసలు విషయాలను తేల్చారు పోలీసులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments