నిమ్స్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య

ఠాగూర్
శుక్రవారం, 17 అక్టోబరు 2025 (13:26 IST)
హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థి ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనస్థీషియా విభాగానికి చెందిన ఈ వైద్య విద్యార్థి... గురువారం రాత్రి విధులకు హాజరయ్యాడు. శుక్రవారం ఉదయానికి ఆపరేషన్ థియేటర్‌లో విగతజీవిగా పడివున్నాడు. దీన్ని గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా కోసం ప్రభుత్వం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్‌నే మార్చివేసింది : పయ్యావు కేశవ్ 
 
గత 2024లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు వేసిన ఒకే ఒక్క ఓటు రాష్ట్ర ప్రజల భవిష్యత్‌నే మార్చివేసిందని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. కర్నూలులో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, 2024 ఎన్నికల్లో ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్తునే మార్చివేసిందని, ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో నిలిపిందన్నారు. 
 
గతంలో 'ఒక్క ఛాన్స్' అంటూ అధికారంలోకి వచ్చిన వారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. ప్రజలు ఎన్డీఏ కూటమికి వేసిన ఒక్క ఓటు వల్లే రాష్ట్రానికి లక్షల కోట్ల అభివృద్ధి, వేల కోట్ల సంక్షేమం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 'మీరు వేసిన ఓటుతోనే పోలవరానికి రూ.12,500 కోట్లు, అమరావతికి రూ.15 వేల కోట్లు, విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,400 కోట్ల నిధులు వచ్చాయి. వీటితో పాటు విశాఖకు రైల్వే జోన్, జాతీయ రహదారులకు రూ.70 వేల కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు రూ.70 వేల కోట్లు కేటాయింపులు జరిగాయి' అని వివరించారు. 
 
కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, లక్ష కోట్ల రూపాయలతో బీపీసీఎల్ రిఫైనరీ, ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు పరిశ్రమ వంటి భారీ ప్రాజెక్టులు కూడా ప్రజల ఓటు చలవేనని అన్నారు. '16 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ-2024 పూర్తిచేశాం. 'తల్లికి వందనం' కింద 65 లక్షల మంది తల్లులకు రూ.15 వేలు, 'అన్నదాత సుఖీభవ' ద్వారా రైతులకు రూ.20 వేలు అందిస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆటో డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం వంటివన్నీ ఆ ఒక్క ఓటుతోనే సాధ్యమయ్యాయి' అని తెలిపారు.
 
సూపర్ జీఎస్టీ అమలుతో నిత్యావసరాల ధరలు తగ్గి ప్రతి కుటుంబానికి ఏటా రూ.20 వేలకు పైగా ఆదా అవుతోందని కేశవ్ చెప్పారు. ఈ ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి లోకేశ్ నేతృత్వంలో ఒక బృందం 98 వేలకు పైగా కార్యక్రమాలు నిర్వహించిందని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు, చంద్రబాబు, లోకేశ్ ఆలోచనలతో విశాఖకు గూగుల్ సంస్థ రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులతో వచ్చిందని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ కూటమి కొన్నేళ్లపాటు కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments