Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి గొంతు కోసేందుకు యత్నించిన ప్రియుడికి 16 యేళ్ళ జైలు!!

వరుణ్
సోమవారం, 29 ఏప్రియల్ 2024 (12:58 IST)
తన ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించిన ప్రియుడికి 16 యేళ్ళ జైలుశిక్ష పడింది. ఈ దారుణ ఘటన రెండేళ్ల క్రితం లండన్‌లో జరిగింది. ఈ దారుణానికి పాల్పడింది కూడా హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడే. హత్యాయత్నానికి ముందు నిందితుడు క్షణాల్లో ఎలా చంపాలో గూగుల్‌లో శోధించి తెలుసుకున్నట్ట పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. 
 
కోర్టు వివరాల ప్రకారం, హైదరాబాద్ నగరానికి చెందిన శ్రీరామ్ అంబర్లకు, 2017లో కాలేజీలో చదువుతుండగా బాధితురాలు సోనా బిజుతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారు. అయితే, శ్రీరామ్ వేధింపులు తాళలేక సోనా అతడితో బంధాన్ని తెంచేసుకుంది. కానీ, అతడు మాత్రం ఆమె వెంటపడుతూ వేధించసాగాడు. పలు మార్లు ఆమె ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. 
 
ఇదిలావుంటే, 2022లో ఇద్దరూ పైచదువుల కోసం యూకే వెళ్లారు. అక్కడ సోనా లండన్‌లోని ఈస్ట్ హామ్ అనే ప్రాంతంలోని రెస్టారెంట్లో పనికి కుదురుకుంది. కానీ శ్రీరామ్ మాత్రం సోనాను వేధించడం ఆపలేదు. సోనాతో మాట్లాడేందుకు తరచూ ఆమె రెస్టారెంట్‌కు ఫోన్ చేసేవాడు. సోనాతో మాట్లాడాలని కోరేవాడు. ఆమెతో మాట్లాడాలనే ఉద్దేశంతో తరచూ ఆ రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేస్తుండేవాడు.
 
ఇక ఘటన జరిగిన రోజు కూడా శ్రీరామ్ ఆ రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్ ఆర్డరిచ్చారు. కానీ ఆమె మాత్రం ఇతర కస్టమర్లతో వ్యవహరించినట్టే అతడితో వ్యవహరించింది. ఈలోపు ఫోనులో ఏదో చూసి శ్రీరామ్ ఆమెను మళ్లీ బెదిరించాడు. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానన్నాడు. కానీ, ఆమె పెళ్లికి అంగీకరించకపోవడంతో కత్తి తీసుకుని ఆమె గొంతు కోసేశాడు. ఏకంగా తొమ్మిది సార్లు ఒంటిపై పొడిచాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన ఆమె కోలుకునేందుకు ఏకంగా నెల రోజులు పట్టింది. హత్యాయత్నానికి మునుపు నిందితుడు గూగుల్లో పలు అంశాలు సెర్చ్ చేశాడు. 'క్షణాల్లో హత్య ఎలా చేయాలి', ‘లండన్‌లో విదేశీయుడు హత్య చేస్తే ఏమవుతుంది?', 'కత్తితో చంపడం ఎలా?” అని ఆన్లైన్లో వెతికినట్టు దర్యాప్తులో తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: పవన్ గొప్ప మనసున్న వ్యక్తి... ఆయనతో కలిసి నటించడం అదృష్టం

చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ (video)

అల్లు అర్జున్ కు దిష్టి తీసిన కుటుంబసభ్యులు - అండగా వున్నవారికి థ్యాంక్స్

సూర్య 45 లో, RJ బాలాజీ చిత్రంలో హీరోయిన్ గా త్రిష ఎంపిక

చియాన్ విక్రమ్, మడోన్ అశ్విన్, అరుణ్ విశ్వ కాంబినేషన్ లో చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments