Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ముందే ప్రియురాలితో భర్త రొమాన్స్, అడ్డుకున్నందుకు కొడుకును చంపేసాడు

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (18:32 IST)
వివాహేతర సంబంధం వద్దని భర్తని ప్రాధేయపడింది. కలిసి ఉందామని చెప్పింది. మన కుమారుడిని చూసైనా వివాహేతర సంబంధం మానుకోవాలని చెప్పింది. అయినా అతనిలో మార్పు రాలేదు సరికదా ప్రియురాలిని నేరుగా ఇంటికే తీసుకువచ్చి భార్య ముందే రొమాన్స్ చేశాడు.
 
కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు సిటీకి చెందిన సునీల్ కుమార్ స్థానికంగా ప్రైవేటు గార్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి సింధు అనే మహిళతో వివాహమైంది. వీరికి 8 యేళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. అయితే సునీల్‌కు గార్మెంట్స్‌లో పనిచేసే నదియా అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది.
 
ఇంటికి ఆలస్యంగా వస్తుండటంతో భార్య పలుమార్లు అనుమానం పడింది. చివరకు గార్మెంట్స్ కంపెనీలో తెలుసుకుంటే తన భర్త ఎవరితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. దీంతో భర్తను ప్రాథేయపడింది. కాపురం నాశనమైపోతుందని చెప్పింది. అయినా సునీల్‌లో మార్పు రాలేదు.
 
అంతే కాదు వివాహేతర సంబంధంతో పాటు మద్యం సేవించడం నేర్చుకున్నాడు. రోజు తాగడం ఇంటికి రావడమే పనిగా పెట్టుకున్నాడు. మద్యం మత్తులో భార్యను చితకబాదేవాడు. అయితే భర్త అకృత్యాలను భరిస్తూ వచ్చింది భార్య. 
 
కానీ రోజురోజుకు శృతి మించడంతో ఇద్దరి మధ్యా గొడవలు తారాస్థాయికి చేరాయి. దీంతో ప్రియురాలిని ఇంటికి పిలిపించుకుని శృంగారంలో మునిగితేలేవాడు భర్త. కొడుకు ఎదురుగానే ఇదంతా జరిగేది. దీంతో మనస్థాపానికి గురైన కొడుకు, నీ నీచపు అలవాట్లు ఏంటని ప్రశ్నించాడు.
 
అంతే... ఆవేశంతో ఊగిపోయిన సునీల్, కొడుకును అతి దారుణంగా కొట్టి చంపేశాడు. తల్లి ఎదురుగానే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఇలా చేశాడు సునీల్. అతడిని పోలీసులు అరెస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments