Webdunia - Bharat's app for daily news and videos

Install App

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

సెల్వి
శుక్రవారం, 4 జులై 2025 (12:01 IST)
Husband kills Tamil Nadu councillor
తమిళనాడు, తిరువళ్లూరు జిల్లాలో ఘోరం జరిగింది. మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే భర్త నరికి చంపేశాడు. ఈ ఘటన తిరువళ్లూరు, తిరునిండ్రవూర్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... తిరువళ్లూరు జిల్లా , తిరునిండ్రవూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎస్ గోమతి కౌన్సిలర్‌గా పనిచేస్తోంది. పదేళ్ల క్రితం గోమతికి స్టీఫెన్ రాజ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. 
 
ఈ జంటకు పెళ్లి కాగా వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే గోమతికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానంతో ఇద్దరి మధ్య గొడవలు తరచుగా గొడవలు జరుగుతూ వుండేవి. 
 
గోమతి ఇటీవల ఆ వ్యక్తిని కలిసిందని.. ఆమె భర్తకు తెలిసింది. దీంతో గోమతి భార్య స్టీఫెన్ రాజ్ ఆమెతో గొడవపడ్డాడు. ఈ వివాదం కాస్త ముదరడంతో భర్త స్టీఫెన్ ఆమెను నడి రోడ్డుపై కత్తితో నరికి చంపేశాడు. ఆ తర్వాత సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై తిరువళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments