ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రెహాలో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. ఇంటి ఎదురుగా పశువులను మేపుతున్న కార్మికుడిపై ఇంటి యజమాని దుర్భాషలాడటమే కాకుండా నీ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుంటా చూస్తూ వుండు అని సవాల్ విసిరాడు. ఈ మాటలతో తీవ్ర మనస్థాపానికి గురైన కార్మికుడు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.
పూర్తి వివరాలను చూస్తే... జనవరి 4వ తేదీన కార్మికుడు తన పశువులకు మేత మేపేందుకు చెరకు మిల్లు నుంచి చెరకు చెత్తను తీసుకుని వచ్చాడు. ఈ క్రమంలో తన ఇంటి బయట పశువులకు మేత తినిపిస్తున్నాడు. ఇంతలో పొరుగింట్లో వుండే నీతూ అనే యువకుడు బయటకు వచ్చి పశువులకు వేసే చెత్తనంతా మా ఇంట్లో పడేట్లు చేస్తున్నావంటూ అతడితో వాగ్వాదానికి దిగాడు.
ఈ వాదనలో నీతూ మరింత రెచ్చిపోయి.. నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటా, నువ్వు చూస్తూ వుండు అని సవాల్ విసిరాడు. ఈ మాటలకు తీవ్ర మనస్థాపం చెందిన కార్మికుడు వెంటనే విషం తాగి ఆత్మహత్య యత్నం చేసాడు. విషయం తెలుసుకుని అతడిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ఐతే అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.