Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి పండక్కి రమ్మన్నాడు, భార్య రానన్నందుకు ఉరి వేసుకున్నాడు

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (12:36 IST)
నాగర్ కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. తన భార్యను సంక్రాంతి పండుగకు ఇంటికి రావాలంటూ భర్త పిలిచాడు. ఐతే అందుకు భార్య ససేమిరా అని అనడంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు భర్త.

 
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... నాగర్ కర్నూలు పట్టణంలోని రాంనగర్ కాలనీలో 30 ఏళ్ల రాజవర్థన్ ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం ఇతడికి పెళ్లైంది. ఐతే గత ఆరు నెలల క్రితం వరకూ వారి సంసారం హాయిగా సాగింది.

 
ఆరు నెలల ముందు ఇరు కుటుంబాల మధ్య కలహాలు తలెత్తాయి. దీనితో భార్యాభర్తలు తరచూ వాగ్వాదం చేసుకోవడం మొదలైంది. భర్తతో తనకు లాభం లేదని అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఏదో కోపంలో వెళ్లిపోయిందిలే అనుకున్నాడు రాజవర్థన్. కానీ ఆమె పుట్టింటి నుంచి తిరిగి రాకుండా అక్కడే వుండిపోయింది.

 
ఈ సంక్రాంతి పండుగకైనా ఇంటికి రావాలంటూ ఆమెను ఆహ్వానించాడు భర్త. అందుకు అతడి భార్య ససేమిరా అంది. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన భర్త ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments