Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదో తరగతి బాలికకు హెడ్మాస్టర్ లైంగిక వేధింపులు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (09:46 IST)
నాలుగు మంచి మాటలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఐదో తరగతి విద్యార్థినిని లైంగికంగా వేధించారు. ఈ దారుణం ఏపీలోని బాపట్ల జిల్లా కేంద్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బాపట్ల పట్టణంలోని మల్లికార్జున బృందావనం కాలనీ పురపాలక ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పి.రామచంద్రరావు ఎక్కాలు చెబుతానంటూ బాలికను ఒంటరిగా గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత విద్యార్థిని ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు జరిగిన ఘటన తెలియజేసి విలపించింది. 
 
ఆ బాలిక తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడిని నిలదీయగా, తాను అలాంటి పనులకు పాల్పడలేదని చెప్పారు. దీంతో వారు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ వెంకటేశులు, పట్టణ సీఐ శ్రీనివాసులు.. బాధితురాలు, కుటుంబ సభ్యులను విచారించి వివరాలు నమోదు చేశారు. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం