Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం పేరుతో మహిళకు గాలం.. 22 బంధించి అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (14:58 IST)
ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. ఉద్యోగం పేరుతో ఓ మహిళకు గాలం వేసిన ఓ వ్యక్తి.. ఆ మహిళను ఏకంగా 22 రోజుల పాటు గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం రాష్ట్రంలోని హరిద్వార్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్‌‌కు చెందిన ఒక వివాహితకు నదీమ్‌ అనే వ్యక్తితో కొంత కాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు. అందుకోసం మహిళను జులై 7వ తేదీన తనతో పాటు హరిద్వార్‌కు తీసుకువచ్చాడు. తర్వాత మహ్మద్‌ షకీబ్‌ అనే వ్యక్తిని ఆమెకు పరిచయం చేశాడు. 
 
ఈ క్రమంలో షకీబ్‌ ఆమెకు మత్తు మందు ఇచ్చి బంధించాడు. 22 రోజుల పాటు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి అతడి భార్య అయేషా కూడా సహకరించింది. ఈ క్రమంలో బాధిత మహిళ ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ.. హరిద్వార్‌ వీధుల్లో తిరుగుతూ పోలీసుల కంటపడింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 
 
అనంతరం బాధితురాలి వివరాలు తెలుసుకున్నారు. ఆమె భర్తను పిలిపించి మాట్లాడించారు. దీంతో ఆమె అసలు విషయం బయట పెట్టింది. అనంతరం పోలీసులు ఆమెకి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్‌ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments