Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారం

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (23:30 IST)
మేకలను పెంచడం అమ్మడం.. డబ్బులు సంపాదించుకుని కుటుంబాన్ని పోషించడం ఇదే ఆ కుటుంబం పని. ఒకే ఒక్క కుమార్తె. ఆమెకు 13 యేళ్ళు. తండ్రితో పాటు ఆమె కూడా మేకలను మేస్తూ ఉండేది. అయితే ఎప్పటిలాగే మేకలను మేపడానికి వెళ్ళిన ఆ బాలికను కొంతమంది కిడ్నాప్ చేశారు. అతి క్రూరంగా బాలికపై అత్యాచారం చేశారు.

 
రాజస్థాన్ లోని భరత్ పూర్‌లో దారుణం జరిగింది. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. కోహ్ పోలీస్టేషన్ పరిధిలో నివాసముండే ఒక బాలిక గొర్రెలను మేపుతూ అటవీ ప్రాంతంలోకి వెళ్ళింది. మధ్యాహ్నం 2గంటల సమయం. ఐదుమంది యువకులు మూడు ద్విచక్రవాహనాల్లో అటువైపుగా వెళుతున్నారు.

 
అయితే వారికి ఈ బాలిక కనిపించింది. వెంటనే ఆమె నోటిని మూసివేసి ఎత్తుకెళ్ళారు యువకులు. సాయంత్రం అయినా బాలిక ఇంటికి రాకపోవడంతో తండ్రి పోలీసు స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంత వెతికినా బాలిక ఆచూకీ మాత్రం దొరకలేదు.

 
అయితే రెండురోజుల తరువాత బాలిక ఇంటికి వచ్చింది. రెండు రోజుల నుంచి 16 మంది యువకులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఏడుస్తూ చెప్పింది. అంతేకాదు కనీసం తిండి కూడా పెట్టలేదని.. చిత్రహింసలకు గురిచేశారని చెబుతూ కన్నీంటి పర్యంతమైంది. బాధితురాలి ఫిర్యాదుతో ప్రస్తుతం పోలీసులు నిందితులను వెతికే పనిలో పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments