Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ అవగానే మాజీ మిస్ కేరళ, రన్నరప్‌లను తనతో రమ్మన్నాడు, కాదనేసరికి ఆడి కారులో...

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (16:03 IST)
నవంబరు 1వ తేదీ 2021న మాజీ మిస్ కేరళ అన్సీ, రన్నరప్ అంజనా షాజన్ ఇద్దరూ కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అలా దుర్మరణం చెందేట్లు వెంటాడాడు ఓ డ్రగ్ పెడ్లర్. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు నివేదికలో సంచలన విషయాలు వెల్లడించారు. ఆరోజు ఓ హోటల్లో పార్టీ ముగియగానే వారిద్దరినీ తన కారులో రావాలంటూ ఆహ్వానించాడు. అందుకు వారు ససేమిరా అన్నారు.

 
దాంతో వారు ప్రయాణిస్తున్న కారును తన ఆడి కారులో వెంబడించి తరుమాడు. భయపడిపోయిన వాళ్లిద్దరూ కారు వేగాన్ని మరింత పెంచారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న ఓ సైక్లిస్టును తప్పించబోయే ప్రమాదానికి గురై అక్కడికక్కడే చనిపోయారు. ఇదంతా పోలీసుల విచారణలో తేలింది.

 
కాగా మాజీ మిస్ కేరళను, రన్నరప్ ఇద్దరినీ తరుముకుంటూ వచ్చిన వ్యక్తి సైజు థంక్‌చన్ అని పోలీసుల విచారణలో తేలింది. ఇతడికి కొచ్చిలోని డ్రగ్స్ పెడ్లర్స్ తో సంబంధాలున్నాయనీ, ఆ రోజు హోటల్లో కూడా పార్టీలో డ్రగ్స్ వాడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా హోటల్ యజమానితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసారు. మొత్తమ్మీద మాదక ద్రవ్యాల పెడ్లర్ కారణంగా ఇద్దరి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments