Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వే ఇలా చేస్తే ఎలా నాన్నా! - కుమార్తెపై తండ్రి అఘాయిత్యం...

ఠాగూర్
బుధవారం, 12 మార్చి 2025 (09:25 IST)
నాన్నంటే రక్షణ. అతను చేయిపట్టుకుని నడిపిస్తే బిడ్డకు కొండంత ధైర్యం. బయటవాళ్లు ఏమైనా అంటే మా నాన్నకు చెబుతా అని బెదిరిస్తారు పిల్లలు. అలాంటి తండ్రే అఘాయిత్యానికి పాల్పడుతుంటే ఆ ఆడ బిడ్డ బయటకు చెప్పుకోలేపోయింది. పాఠశాల టీచర్ అమ్మలా ఆమె మనసు గమనించి ఆరా తీస్తే వెక్కివెక్కి ఏడుస్తూ విషయమంతా చెప్పింది. ఉపాధ్యాయుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజమండ్రి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వ్యక్తి (45) మెకానిక్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఆయనకు 17 యేళ్ల  కింద వివాహం కాగా, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. దంపతులు మధ్య విభేదాలతో ఎనిమిదేళ్ల కిందట పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. 15 యేళ్ల పెద్ద కుమార్తె మూడేళ్లుగా తండ్రి వద్ద వచ్చి ఉంటోంది. ఈ బాలిక నగరంలోని ఓ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తుంది. మంగళవారం పాఠశాలకు వచ్చిన బాలిక నిరుత్సాహంగా ఉండటాన్ని ఉపాధ్యాయురాలు గమనించారు. బాలికను ఓదార్చుతూ ఆరాతీస్తే, తండ్రి గత కొద్ది రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు చెప్పి కన్నీరు పెట్టుకుంది. 
 
ఈ విషయాన్ని ఉపాధ్యాయుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొద్ది నెలల కిందట మద్యం మత్తులో తండ్రి తనపై లైంగికదాడి చేశాడని, నాటి నుంచి తరచూ అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలిక పేర్కొంది. దీంతో పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం