Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరణశాసనం రాసిన మద్యంమత్తు!

ఠాగూర్
సోమవారం, 30 డిశెంబరు 2024 (15:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సీపట్నంలో మద్యంమత్తు మరణశాసనం రాసింది. పీకల వరకు మద్యం సేవించిన తండ్రి కన్నకొడుకునే హత్య చేశాడు. స్థానిక పోలీసుల కథనం మేరకు... విశ్రాంత ఆర్మీ ఉద్యోగి కఠారి రమణ (70) పట్టణంలోని లక్ష్మీనగరులో ఉన్న ఓ అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. భార్య సత్యవతి కొన్నేళ్ల కిందట మరణించింది. వీరికి కుమారుడు భాస్కరరావు (32). కుమార్తె పావని ఉన్నారు. 
 
తండ్రీ, కొడుకు అపార్టుమెంట్‌లో కలిసే ఉంటున్నారు. కుమార్తె ధర్మసాగరం సమీపంలో ఉంటోంది. ఆమె అప్పుడప్పుడు వచ్చి తండ్రి, తమ్ముడు యోగక్షేమాలు తెలుసుకుని వెళ్లేది. వీరిద్దరికి వంట, ఇంటి పనులు చేసేందుకు పనిమనిషి వస్తుంది. భాస్కరరావు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు.
 
శనివారం రాత్రి కుటుంబానికి సన్నిహితుడైన జిలానీతో కలిసి ఇంట్లో మద్యం తాగారు. డబ్బు దుబారా చేస్తున్నావంటూ తండ్రి, కొడుకు ఒకరిపై ఒకరు కేకలు వేసుకున్నారు. మద్యం తాగడం పూర్తయ్యాక జిలానీ తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తండ్రికొడుకుల మధ్య వాగ్వాదం కొనసాగింది. కోపం అదుపు తప్పడంతో తండ్రి రమణ పూరీ కర్రతో కొడుకు తలపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. 
 
మద్యం మత్తులోనే రమణ తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. తెల్లారిన తర్వాత మెళకువ వచ్చాక బయటకు వచ్చి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న కొడుకును చూసి బోరున విలపించాడు. కొద్దిసేపటికే ఇంటికొచ్చిన పనిమనిషికి రాత్రి జరిగినదంతా చెప్పాడు. ఆమె ఇచ్చిన సమాచారంతో స్థానిక పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుడుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్

రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌ లోని సాంగ్ కు డాన్స్ చేసిన గౌతమ్ వాసుదేవ మీనన్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టెక్నికల్ టీమ్ మార్పు !

ఇన్ని కండోమ్‌లైతే కన్యలు దొరకడం కష్టమే, ఐతే మేకలు, కుక్కలతో శృంగారం కోసం కొనండి: చిన్మయి ఘాటు రిప్లై

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments