Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేడీ డాక్టర్‌ను పెళ్ళి పేరుతో నమ్మించి హోటల్‌కు పిలుపు... కోరిక తీర్చుకున్నాక పెళ్లికి నిరాకరణ

ఠాగూర్
బుధవారం, 21 మే 2025 (11:25 IST)
ఓ మహిళా వైద్యురాలు అత్యాచారానికి గురయ్యారు. పెళ్లి పేరుతో నమ్మించి హోటల్‌కు పిలిపించిన ఓ కామాంధుడు.. తన కోరిక తీర్చుకున్నాక పెళ్లికి నిరాకరించాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోకి బంజారాహిల్స్ ప్రాంతంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
హైదరాబాద్ నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో ఓ మహిళ వైద్యురాలిగా పనిచేస్తుంది. ఆమెకు పాలమూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే వైద్యుడు డాక్టర్ స్వామితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొంతకాలానికి పెళ్ళి ప్రస్తావన వరకు దారితీసింది. ఈ క్రమంలో, ఈ యేడాది జనవరి నెలలో బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని డాక్టర్ స్వామి నమ్మించాడు.
 
ఆ తర్వాత సదరు వైద్యురాలిని హైదరాబాద్ బంజారా హిల్స్‌లో ఉన్న ఓ హోటల్‌కు పిలిపించి, మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తాను పెళ్లి చేసుకోని తెగేసి చెప్పాడు. దీంతో పెళ్లి పేరుతో తనను మోసం చేసి, లైంగిక దాడికి పాల్పడ్డాడని గ్రహించిన మహిళా వైద్యురాలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. 
 
ఆ తర్వాత తనకు జరిగిన అన్యాయంపై ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. డాక్టర్ స్వామి తనను పెళ్ళి పేరుతో నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్ స్వామిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం