Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దారుణం : మహిళపై గ్యాంగ్ రేప్ - మర్మాంగంలో రాడ్ దూర్చి...

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (15:12 IST)
ఢిల్లీ నగర శివారు ప్రాంతమైన ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. మరో మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమెను ఏకంగా ఐదుగురు కామాంధులు మానభంగం చేశారు. అప్పటికీ కిరాతకులకు కసి తీరకపోవడంతో బాధితురాలి జననాంగాల్లో ఇనుప రాడ్‌ను చొప్పించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీకి చెందిన ఓ మహిళ మంగళవారం రాత్రి ఘజియాబాద్ నుంచి ఢిల్లీకి తనకు తెలిసిన ఇద్దరు వ్యక్తులతో కారులో ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో మరో ముగ్గురు వ్యక్తులు కలిశారు. వీరంతా కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పటికీ కసి తీరకపోవడంతో ఆమె ప్రైవేట్ భాగాల్లో ఐరన్ రాడ్‌లను జొప్పించారు.
 
దీనిపై పోలీసులు స్పందిస్తూ, ఈ నెల 18వ తేదీ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఆశ్రమ రోడ్డులో ఒక మహిళ అచేతనంగా పడివున్నట్టు నందిగ్రామ్ పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లి ఆ మహిళను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రస్తుతం ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితురాలిని ఢిల్లీకి నంద్ నగరికి చెందిన మహిళగా గుర్తించారు. తన సోదరుడు పుట్టిన రోజు వేడుకల కోసం ఆమె ఘజియాబాద్‌కు వెళ్లి, తిరిగి ఢిల్లీకి వస్తుండగా ఈ దారుణం జరిగింది. ఆమెకు తెలిసిన కొందరు ఆమెను ఘజియాబాద్ నుంచి కారులో ఎక్కించుకున్నారు. 
 
ఆరంభంలో ఇద్దరు మాత్రమే కారులో ఉన్నారు. మార్గమధ్యంలో మరో ముగ్గురు కలిసి ఓ గదిలో బంధించిన అత్యాచారం చేసినట్టు ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం