Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసునంటూ బెదిరించి విద్యార్థినిపై అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 13 జులై 2023 (15:40 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. తాను పోలీసునంటూ బెదిరించిన ఓ కామాంధుడు విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె తన ప్రియుడితో ఉన్న ఫోటోలను చూపించిన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గత వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 7వ తేదీన ఓ కాలేజీ విద్యార్థిని తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కారులో వెళ్తుండగా ఓ వ్యక్తి బైక్‌పై వారిని అనుసరించాడు. వారి ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ అమ్మాయిని ఇంటిదగ్గర దిగబెట్టి బాయ్‌ఫ్రెండ్‌ వెళ్లగానే నిందితుడు ఆమె దగ్గరకు వచ్చాడు. 
 
తాను పోలీసునని చెప్పి.. ఆమె వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌ బయటే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుణ్ని అరెస్టు చేసినట్లు తెలిపారు.
 
బాడీ షేమింగ్‌కు గురయ్యానా?.. : కావ్యా కళ్యాణ్ రామ్ 
 
బాడీ షేమింగ్ విషయంలో పలువురు దర్శకుల ధోరణి తనను ఇబ్బంది పెట్టిందంటూ తాను వ్యాఖ్యానించింగా వచ్చిన వ్యాఖ్యలపై హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ కొట్టిపారేశారు. ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు తానెప్పుడూ చేయలేదని చెప్పింది. పైగా, పుకార్లు భలే సృష్టిస్తారండీ అంటూ కామెంట్స్ చేశారు. బాల నటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కావ్య.. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'గంగోత్రి', 'ఠాగూర్', 'అడవిరాముడు' మొదలైన చిత్రాల్లో నటించారు.
 
ఇటీవల హీరోయిన్‌గా 'మసూద' చిత్రంలో వెండితెరపై కనిపించింది. అయితే, ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ మూవీ కావంతో కావ్య పాత్ర గురించి ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత వచ్చిన "బలగం" చిత్రం మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం ఏకంగా వంద రోజుల పాటు ప్రదర్శించబడింది.
 
ఇకపోతే, బాడీ షేమింగ్ విషయంలో కొంతమంది దర్శకులు ధోరణి తనను చాలా బాధపెట్టిందని కావ్య ఒక ఇంటర్వూలో వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. తన విషయంలో ఏ దర్శకుడు కూడా ఎపుడూ అలా మాట్లాడలేదని చెప్పారు. అసలు ఆ విషయాన్ని గురించి తాను ఎక్కడా ప్రస్తావించలేదని కావ్య చెప్పుకొచ్చింది. ఇలాంటి అనవసరమైన ప్రచారాలు మానుకోవడం మంచిదంటూ ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments