Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగికంగా వేధిస్తున్న ట్యూటర్‌ను కత్తితో పొడిచిన బాలుడు...

Webdunia
ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (15:26 IST)
తనను లైంగికంగా వేధిస్తూ వచ్చిన ఓ ప్రైవేట్ ట్యూటర్‌ను ఓ బాలుడు కత్తితో పొడిచాడు. ఈ ఘటన ఢిల్లీలోని జామియా నగర్ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వసీం అనే 28 యేళ్ల ప్రైవేట్ ట్యూటర్ తన వద్దకు వచ్చే బాలుడిని కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. 
 
పలుమార్లు వేధించడమే కాకుండా, ఆ ఘటనను వీడియో కూడా తీసి బయటకు చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో గత నల 30వ తేదీన 11.30 గంటల సమయంలో బాలుడిని మరోమారు పిలిచాడు. అప్పటికే అతడి చేష్టలతో విసిగిపోయిన బాలుడు.. వసీంను చంపాలని నిర్ణయించుకున్నాడు. పేపర్ కటర్‌ను వెంట తీసుకెళ్లిన బాలుడు.. వసీం తనపై లైంగికదాడికి యత్నించిన వెంటనే కత్తితో పొడిచి చంపేశాడు. 
 
ఆగస్టు 30న ఓ ఇంట్లో మృతదేహం పడివుందన్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని వసీంగా గుర్తించారు. ఆ ఇల్లు అతడి తండ్రిదని, కొన్ని రోజులుగా అది ఖాళీగా ఉందని తెలిసింది. బాధితుడు తన కుటుంబంతో కలిసి జకీర్ నగరులో ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం